క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమే..
- అదనపు కలెక్టర్ చంద్రయ్య
- జోనల్ స్థాయి బ్రెయిన్ రైన్ 20226 సైన్స్ అగ్జిబిషన్
- ఆకట్టుకున్న విజ్ఞాన ప్రదర్శన
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఆశ్రమ వెల్ఫేర్ పాఠశాల లో(Government Social Welfare Ashram Welfare School) తలపెట్టి జోనల్ స్థాయి బ్రెయిన్ రైన్ 2026 సైన్స్ అగ్జిబిషన్ అట్టహాసంగా జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్ అనుపమ ఆధ్వర్యంలో జరిగిన విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ పీ. చంద్రయ్య ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. విజ్ఞాన ప్రదర్శన ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
విజ్ఞాన ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సైన్స్ అగ్జిబిషన్ విద్యార్హుల్లో క్రమశిక్షణను అలవరుస్తుoదన్నారు. క్రమశిక్షణ ఉంటే విద్యార్థులు ఏదైనా సాధించవచ్చునన్నారు. పట్టుదల విద్యార్థుల్లో దాగిన సైన్స్ విజ్ఞానాన్ని భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని పేర్కొన్నారు. లక్ష్య సాధన కు విజ్ఞానం విజయ శిఖరాలకు చేరుస్తుందన్నారు.
మెదడును సైన్స్ ప్రదర్శననలు పరుగులు పెట్టిస్తాయన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంతో సులువుగా సాధిస్తారన్నారు. ఆశ్రమ పాఠశాలలో టీచర్ల మార్గదర్శకత్వం సమర్థవంతంగా ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుకెళుతున్నారన్నారు. ప్రభుత్వం ఆశ్రమ పాఠశాల లక్ష్యం విద్యార్థులకు దూరమైన భవిష్యత్తు కల్పించడమేనన్నారు.
విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే విధంగా తమ లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఇతను చెప్పారు. తాను ఆశ్రమ పాఠశాల నుంచి విద్యాభ్యాసం చేపట్టానని అన్నారు. అర్హులైన టీచర్లతో ప్రస్తుతం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోనే విద్య బోధన సాగుతుందన్నారు. విద్యతోపాటు అన్ని రంగాల్లో విద్యార్థులు పురోగతి సాధించాలన్నారు. సైన్స్ సమాజమంతా నిండి ఉందన్నారు.
టీచర్లు,తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థుల్లో అనుకున్న లక్ష్యం దిశగా వెళ్తున్నారన్నారు. బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైంటిస్టులు కనిపిస్తున్నారని తన విద్యార్థులను ఉత్సాహపరిచారు. ప్రతి పనిలో సైన్స్ ఉంటుందని పేర్కొన్నారు. క్రియేటివిటీ అభివృద్ధికి పునాది వంటిదని, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
జోనల్ ఇన్చార్జి శారద మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థుల్లో అపార జ్ఞానం దాగి ఉందన్నారు. విద్యార్థుల్లో ప్రశించేతత్వం సైన్స్ తోటి అభివృద్ధి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు విజ్ఞన ప్రదర్శన పునాదివేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన వైజ్ఞానిక ప్రాజెక్టు స్టాళ్లను అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య సందర్శించారు. వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు.
విద్యార్థులు ఆయనకు తయారు చేసిన ప్రాజెక్టులను వివరించారు. ఈనెల 19న విజ్ఞాన ప్రదర్శన ముగింపు వేడుక జరుగుతుంది. జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో కాలేశ్వరం జోన్ 1 పరిధిలోని 10 జిల్లాలోని 59 పాఠశాలల నుంచి, 239 విద్యార్థులు ఈ విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఐ ఈ ఓ సి హెచ్ మదర్, సైన్స్ జిల్లా సెంట్రల్ ఇన్చార్జి రాజగోపాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ డిడి రవుఫ్ ఖాన్, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిడి దుర్గాప్రసాద్, మండల విద్యాధికారి పోచయ్య, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.