నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు అండగా నిలుస్తున్నారు

15-11-2026 | 08:45pm

మంథని లో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ లో దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, నవంబరు 15(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత(Unemployed youth) పోలీస్ ఉద్యోగాలు(Police Jobs) సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Srinu Babu) ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(Duddilla Srinu Babu) అన్నారు.

ఆదివారం మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్‌లో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో శ్రీ విశ్వ అకాడమీ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత మన ఊరు–మన కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శ్రీను బాబు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచితంగా శిక్షణ అందించడంతో పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 120 రోజులు పూర్తి చేసుకుంటున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

క్రమశిక్షణతో కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి తమ కుటుంబాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మంత్రి శ్రీధర్ బాబు చేపడుతున్న కార్యక్రమాలు నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తున్నాయని శ్రీను బాబు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు