సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
వరంగల్, (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister's Relief Fund) నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను(CMRF cheque) మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్‌తో(Mohammad Ayub, Warangal District Congress Party President) కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చికిత్స చేయించుకున్న పేద ప్రజలకు ఆర్థీక సహాయం అందిస్తూ అండగా నిలుస్తుందన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో 57మంది లబ్దిదారులకు సుమారుగా రూ.72లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన్నట్లుగా వారు తెలిపారు.