అత్యంత వైభవంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

29-11-2026 | 07:38pm

పడిపూజలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, రాజకీయ నాయకులు, అయ్యప్ప మాలాధారులు

ఘట్ కేసర్, నవంబర్ 29 (విజయక్రాంతి) : స్వామియే శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా అంటూ వందలాది మంది అయ్యప్ప మాలాదారులు చేసిన శరణుఘోషతో ఘట్ కేసర్ పట్టణ(Ghatkesar town) ప్రాంతం మారుమ్రోగింది. ఘట్ కేసర్ పట్టణం(Ghatkesar town), మారుతినగర్ మైదానంలో కన్నెస్వామి మదనగిరి అనుష్ గౌడ్ అధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడిపూజ మహోత్సవం బర్ల ఆంజనేయులు గురుస్వామి చేతుల మీదుగా పడిపూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో(devotional) ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈమహోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajender), ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Mallareddy), జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మదనగిరి సురేష్ గౌడ్, అనుష్ గౌడ్ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పాల్గొని పూజలు నిర్వహించారు. పడిపూజలో 18మెట్ల పూజతో పాటు మణికంఠ స్వామికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, తేనాభిషేకం, పుష్పాభిషేకాలు చేశారు.

ఘట్ కేసర్ సర్కిల్ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది అయ్యప్ప మాలాదారులు, మహిళా భక్తులు(devotees) కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనడంతో పడిపూజ ప్రాంగణం కిటకిటలాడింది. అయ్యప్ప భక్త బృందం అయ్యప్పస్వామి కీర్తనలు, భజనలతో హోరెత్తించారు. దీంతో పడిపూజ మహోత్సవం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగింది. అయ్యప్పస్వాములు చేసిన పేటతుళై నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పూజలో పాల్గొన్న భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేసి అన్నదానం చేశారు.

మరిన్ని వార్తలు