బఫర్ జోన్లో బడి!?
- ఓల్డ్ బోయిన్పల్లి ‘శ్రీ దర్శన్ స్కూల్’ అక్రమ నిర్మాణంపై ఆరోపణ
- 100 గజాల్లో ఐదంతస్తులు
- ఫైర్ ఇంజన్ సైతం వెళ్లలేని ఇరుకైన గల్లీలో పాఠశాల నిర్వహణ
- పట్టించుకోని జీహెచ్ఎంసీ, విద్యాశాఖ అధికారులు
నవంబర్ 17 (విజయక్రాంతి): చెరువులు, నాలాల బఫర్ జోన్లలో(Buffer zones for lakes and drains (nalas)) ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కఠిన నిబంధనలు(Strict regulations) ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అక్రమ నిర్మాణాలు(Illegal constructions) వెలుస్తున్నాయి. సికింద్రాబాద్ ఓల్ బోయిన్పల్లి అంజయ్య(Anjaiah from Old Bowenpally, Secunderabad) నగర్‌లోని ’శ్రీ దర్శన్ స్కూల్(Sri Darshan School)’ భవన నిర్మాణం, నిర్వహణపై స్థానికుల నుంచి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కేవలం 100 గజాల స్థలంలో ఐదు అంతస్తుల భవనం నిర్మించిన పాఠశాల ఈ బఫర్‌జోన్ పరిధిలో ఉందనే స్థానికుల ఆరోపోస్తున్నారు.
భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ(GHMC) నుంచి అనుమతులు ఉన్నాయా? మంజూరైన ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు పాఠశాలకు వెళ్లే మార్గం అత్యంత ఇరుకుగా ఉండటంతో అగ్నిమాపక వాహనం సైతం లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అగ్నిప్రమాదం లేదా ఇతర విపత్తు సంభవిస్తే చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఎలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విద్యాశాఖ చట్టాలు ఏం చెబుతున్నాయి?
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ 2009) సెక్షన్ 18, 19 ప్రకారం పాఠశాల గుర్తింపు, మౌలిక సదుపాయాలు, భవన భద్రత, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల నిబంధనలు పాటించడం తప్పనిసరి. తెలంగాణ విద్యా చట్టం 1982లోని సెక్షన్ 20, 21 ప్రకారం విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు, గుర్తింపు నిబంధనలు పాటించాలి. నిబంధనల ఉల్లంఘనపై విచారణ అనంతరం గుర్తింపు ఉపసంహరణతో పాటు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా తెలంగాణ భ వన నిర్మాణ నిబంధనలు, 2012 ప్రకారం చెరువులు, నాలాలు తదితర జలవనరుల బఫర్‌జోన్ పరిధిలో నిర్మా ణాలపై నిర్దిష్ట ఆంక్షలు ఉన్నాయి. అయితే, పాఠశాల భవనానికి సంబంధించినఅనుమతులు, బఫర్‌జోన్ పరిధి, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, పాఠశాల గుర్తింపు పత్రాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అధికారుల నిర్లక్ష్యం..
ప్రభుత్వ అధికారుల అండదండలతోనే అక్రమాలు సాగుతున్నాయా? అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే, కొందరు బీజేపీ రాజకీయ నాయకుల అండదండలతోనే పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని, డీఈవో, ఎంఈవో అధికారులు ఇప్పటికైనా స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ, వాటిపై ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
ప్రజాప్రతినిధులు సైతం ఇలాంటి అంశాలపై స్పందించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నారుల భద్రతతో చెలగాటమా? లేక అధికారుల పర్యవేక్షణ లోపమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంబంధిత శాఖలు తక్షణమే విచారణ చేపట్టి భవన నిర్మాణ అనుమతులు, ఫైర్ సేఫ్టీ, పాఠశాల గుర్తింపు పత్రాలను తనిఖీ చేసి, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.