డిసెంబర్‌లో ఆల్కహాల్

13-11-2026 | 05:00am

అల్లరి నరేశ్(Allari Naresh) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆల్కహాల్’. మెహర్ తేజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. రుహానీ శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నిహారిక ఎన్‌ఎం, సత్య, గిరీశ్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్యకృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేశ్ కాకుమాను, కిరీటి దమరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 18న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ గురువారం ప్రకటించారు.

మరిన్ని వార్తలు