ఇక దాదా ధమాకా

10-11-2026 | 05:10am

బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటిస్తున్న చిత్రం ‘దాదా’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ మేకర్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రత్యేక ప్రకటనతో పాటు కలర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇందులో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ అలరించారు. ఈ పోస్టర్ ద్వారానే సినిమా ఫస్ట్ సింగిల్ టైటిల్‌ను ‘దాదా ధమాకా’గా ప్రకటించారు. ఈ పాటను నవంబర్ 13న విడుదల చేయనున్నారు. డిసెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్ ఐఎస్‌సీ; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్. 

మరిన్ని వార్తలు