మాది వినూత్నమైన బతుకమ్మ పాట
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ‘ఈఎన్‌ఈ రిపీట్’ చిత్రం. తరుణ్ భాస్కర్ దాస్యం(Director Tharun Bhascker Dasyam) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, శివాత్మిక, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ తమ పాత పాత్రలతో మళ్లీ అలరించను న్నారు. నవంబర్ 19న విడుదల కానున్న ఈ మూవీలోని ‘బతుకమ్మ’ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. “నాకు మణిరత్నం ‘సఖి’ సినిమాలోని ‘ఏడే ఏడేడే’ పాట చాలా ఇష్టం. నా సినిమాల్లో కూడా అలాంటి ఒక పాట చేయాలనుకునేవాడిని.
ఈ బడ్డీ కామెడీ సినిమాలో కుదిరింది. ఇదొక ఫెస్టివల్ సాంగ్” అన్నారు. గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. “ఇందులో బతుకమ్మ పాట మాత్రం చాలా వినూత్నంగా ఉంది. ఈ పాటను ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని తెలిపారు. నిర్మాత సందీప్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. “ఇందులో బడ్డీ ఎంటర్ టైన్‌మెంట్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. బతుకమ్మ పాటతో ఎమోషన్ ఇంకా పెరుగుతుంది” అని తెలిపారు. నటీనటులు కూడా మాట్లాడారు. మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.