హనుమాన్ సీక్వెల్స్‌పై బిగ్ ట్విస్ట్

21-11-2026 | 11:59am

హనుమాన్ ఫ్రాంచైజీ రెండుగా చీలిందా? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

2024 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘హను-మాన్’(Hanuman 2 Telugu Movie) సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ Superhero Movie ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు రెండు వేర్వేరు సీక్వెల్స్ రాబోతున్నాయనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఒకే సినిమాకు కొనసాగింపుగా రెండు ప్రాజెక్టులు సిద్ధమవుతుండటంతో టాలీవుడ్‌లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రాజెక్టుగా ‘జై హనుమాన్’ను రూపొందిస్తున్నారు. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘హను-మాన్’ కథకు మరింత విస్తృతమైన Cinematic Universe రూపం ఇవ్వాలనే దిశగా ఈ ప్రాజెక్ట్ సాగుతోంది. మరోవైపు ఒరిజినల్ నిర్మాత కె. నిరంజన్ రెడ్డి కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆయన నిర్మాణంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘హనుమాన్ 2’ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఒకే ఫ్రాంచైజీ నుంచి రెండు వేర్వేరు కథలు, రెండు వేర్వేరు టీమ్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాల వెనుక దర్శకుడు, నిర్మాత మధ్య Creative Differences ఉన్నాయనే ప్రచారం వినిపిస్తోంది. కానీ విభేదాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా స్పష్టతకు రాలేదు. ఏదేమైనా ‘జై హనుమాన్’, ‘హనుమాన్ 2’.. ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది? బాక్సాఫీస్ వద్ద ఏ ప్రాజెక్ట్ పైచేయి సాధిస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


మరిన్ని వార్తలు