ఓం అందరికీ నచ్చుతుంది:మమ్ముట్టి
మంచి చిత్రాలకు ఆదరణ లభిస్తుంది ధనుష్
వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్దా అగర్వాల్ నిర్మాణంలో(Production by Shraddha Agarwal) ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల(Mammootty, Dhanush, Sai Pallavi, Sreeleela) ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం ‘ఓం ఛాప్టర్ రుధిరం: ది బ్లడ్ వుడ్’(Om Chapter Rudhiram The Blood wood). ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నవంబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి, ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల, రేణుదేశాయ్, కాసర్ల శ్యామ్ తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తన మలయాళ సినిమాలను తెలుగులో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలని మమ్ముట్టి తెలిపారు. ఈ సినిమా కోసం దర్శకుడు, ధనుష్, రేణు దేశాయ్, సాయి పల్లవితో పాటు సాంకేతిక బృందం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని ఇది సాధారణమైన సినిమా కాదని, ప్రతీఒక్కరికీ నచ్చుతుందని నవంబర్ 20న థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించాలని ప్రేక్షకాభిమానులకు పిలుపునిచ్చారు. అద్భుతమైన కథను దర్శకుడు రాజ్‌కుమార్ తెరపైకి తీసుకువడంలో ఎంతో కష్టపడ్డారని ధనుష్ తెలిపారు.
చెన్నై అయినా, హైదరాబాద్ అయినా ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిసారిగా ఐపీఎస్ పాత్రలో నటించానని, ప్రజల భద్రత కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తుంటారని, అద్భుత పాత్రలను తీర్చిదిద్దిన దర్శకుడికి సాయిపల్లవి కృతజ్ఞతలు తెలిపారు. ధనుష్‌తో కలిసి సినిమా చేయడం తన అదృష్టమని శ్రీలీల అన్నారు.
ఈ సినిమా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, మమ్ముట్టితో చాలా విషయాలు నేర్చుకున్నానని, ఇప్పటికీ రేణు దేశాయ్ ఎంతో అందంగా ఉన్నారని శ్రీలీల చెప్పారు. సినిమా ఆఫర్ రావడం ఖచ్చితంగా దైవ నిర్ణయమేనని టీమ్ మొత్తానికి రేణుదేశాయ్ ధన్యవాదాలు తెలిపారు. వేదికపై మమ్ముట్టి గారు, ధనుష్ గారు, సాయిపల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్ ఇలా ఎంతోమంది ఒకే వేదికపై ఉండటం చాలా సంతోషంగా ఉందని లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ సంతోషం వ్యక్తం చేశారు.