భయపెడుతూ.. నవ్వించేందుకు సిద్ధం

10-11-2026 | 05:15am

‘డియర్ ఉమ’ అంటూ మొదటి సినిమాతోనే నటిగా, నిర్మాతగా, రచయితగా సుమయా రెడ్డి(Sumaya Reddy) తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడామె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయారెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రకటించనున్నారు.

దీపావళి సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ త్వరలోనే ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని వెల్లడించారు. తాజా పోస్టర్‌లో సుమయారెడ్డి చేతి నిండా డబ్బు, బంగారం తో కనిపిస్తూ, మహారాణిలా కనిపిస్తున్నారు. కామెడీ, హారర్ జానర్‌లో ఇది వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రాబోతోంది అని ఈ ప్రీ లుక్ పోస్టర్‌తో హింట్ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు