బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
వెంకటాపూర్, నవంబర్ 29 (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి తల్లి భాగ్యమ్మ ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి(Gandra Ramana Reddy Condoles) ఆదివారం భాగ్యమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా భాగ్యమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, భాగ్యమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి నాగజ్యోతి, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోవింద్ నాయక్, ములుగు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.