ముందు చూపు లేక లక్ష కోట్ల నష్టం

20-11-2026 | 12:00am

పాలకుల అపసవ్య నిర్ణయాలు, సాగునీటి రంగంలో ముందస్తు ప్రణాళికా లోపం వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఎల్ నినో వంటి విపత్కర(El Nino Crisis) పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయాల్సిన ప్రభుత్వ శాఖల మధ్య అవగా హన కొరవడటం.. రాష్ట్ర వ్యవసాయ రం గంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహానగర తాగునీటి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఎల్ నినో ముప్పుపై నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా పాలక యంత్రాంగం నిద్రమత్తు వీడలేదు. సాగునీటి నిర్వహణ, జలాశయాల్లో నిల్వల విషయంలో తీవ్ర అల సత్వం కనబరిచింది. 

ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే దిగజారేలా చేసింది. కేవ లం రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల స్వల్ప నిధులు కేటాయించి గోదావరి, కృష్ణా జలాలను ముందస్తుగా ఎత్తి పోసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. తెలంగాణలో చిన్నసన్నకారు రైతులు ఎక్కువగా పత్తి వైపు మొగ్గు చూపుతారు. పత్తి దిగుబడి రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రధానమైన ఆర్థిక ఆధారం.

ఈ వానాకాలం జూన్ మధ్య 17 శాతమే వర్షపాతం నమోదైనప్పటికీ, సుదీర్ఘ పొడి వాతావరణం ఏర్పడటంతో పంటలకు తీవ్ర విఘాతం కలిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకా రం రాష్ట్రవ్యాప్తంగా 23.40 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, అందులో 15 లక్షల ఎకరాలు పత్తి ఉండటం ఎల్ నినో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వరి 4 లక్షల ఎకరాల్లో, కందులు, మొక్కజొన్న , మిరప 1.50 లక్షల ఎకరాల్లో  దెబ్బతిన్నాయి. 

పత్తికి పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలకు ఎకరాకు వేల రూపాయలు అప్పుచేసి పెట్టుబడి పెట్టిన సన్న, చిన్నకారు రైతులు.. నేడు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. పత్తి నష్టపోవడం అంటే రైతు వ్యక్తిగతంగా నష్టపోవడం మాత్రమే కాదు, గ్రామీణ కొనుగోలు శక్తి పడిపోయి మార్కెట్‌లు చతికిలబడటం. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న జిన్నింగ్ మిల్లులు, చేనేత, టెక్స్‌టైల్ రంగాలు, లోడింగ్, అన్‌లోడింగ్‌పై ఆధారపడిన రవాణా రంగాలు కూడా ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవి చూశాయి.

అంతేకాదు.. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగం రూ.20,000 కోట్ల ఉత్పత్తిని నష్టపోవడంతో గ్రామీణ సామాజిక ఆర్థిక నిర్మా ణం పెద్ద లోటును భరించాల్సి వస్తుంది. ముఖ్యంగా నల్లగొండ, జనగామ, నారాయణపేట వంటి జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్ర దుర్భిక్షాన్ని తీసుకువచ్చాయి. ప్రభుత్వం మాత్రం కంటితుడుపు చర్యగా కరువు మండలాలను ప్రకటించింది.

జనగామ జిల్లాలో కేవలం మూడు మండలాలను మాత్రమే కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోవైపు రైతులు అనేక పద్ధతుల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నా. పొలాలను తగలబెట్టడం, పొలా ల్లో వాహనాలు తిప్పడం, కొంతమంది రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో విషాదకర పరిణామం ఏమి టంటే.. పంటలను కాపాడుకునేందుకు రైతులు పంట పొలాలకు  ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 

సాగునీటి రంగంలో సరైన ప్రణాళిక, నిధుల కేటాయింపు, సమయానికి ఎత్తిపోతల పథకాలను నడిపించడం ఎంత కీలకమో ఇప్పటికీ ప్రభుత్వం తన అపరాధాన్ని గుర్తించినట్లు లేదు. కానీ, సాధారణ గ్రామీణ ప్రజల నుంచి పట్టణ జీవుల వరకూ అందరికీ ప్రభుత్వ వైఫల్యం అనుభవ పూర్వకంగా అర్థమైంది. మన పొరుగు రాష్ట్రం వాతావరణ హెచ్చరికల ను తీవ్రంగా పరిగణించి, కేవలం రూ.900 కోట్ల విద్యుత్ వ్యయంతో ఎత్తిపోతలను ప్రారంభించి ఏకంగా రూ. 20,000 కోట్ల విలువైన పంటలను ముం దస్తుగా కాపాడుకోగలిగింది.

కానీ, తెలంగాణ పాలక యంత్రాంగంలో  ఆ స్థాయి ప్రణాళిక కరువైంది. ఒకవేళ మన ప్రభు త్వం కూడా సకాలంలో అప్రమత్తమై 100 టీఎంసీలకు పైగా నీటిని సమర్థవంతంగా ఎత్తిపోసి జలాశయాలు, చెరువులను నింపి ఉంటే సాగు, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. భూగర్భ జలాలు పెరిగేవి. ఫలితంగా 15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి ఎండిపోయే పరిస్థితి వచ్చేది కాదు. మరో 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, కంది పంటలు కూడా చేతికి వచ్చేవి. దీని ద్వారా తెలంగాణ రైతాంగానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.20,000 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు దక్కేవి.

రూ.20 వేల కోట్ల వ్యవసాయ ఉత్పత్తి వివిధ రంగాల్లో వినియోగానికి వచ్చేసరికి తెలంగాణ ఆర్థిక రం గంలో రెట్టింపు సంపదంగా రూపాంతరం చెందుతుంది. క్రాప్ హాలిడే ప్రకటించడం ద్వారా మరో రూ.25 వేల కోట్ల పంట ఉత్పత్తులు తెలంగాణ రాష్ర్టం కోల్పోతుంది. ప్రస్లుల కరుదు పరిస్థితుల్లో అప్పులు తీరే మార్గం లేక కొంత మంది రైతులు ప్రాణాలు విడిచిన విషాద ఘటనలు పాలకుల వైఫల్యానికి సజీవ సాక్ష్యా లుగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఆత్మహత్య జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

ప్రభుత్వ లెక్కల ప్రకారం గత సంవత్సరం మత్స్యరంగంలో ఉత్పత్తి అ యిన చేపలు, రొయ్యల మొత్తం విలువ 9,000 కోట్లు. ఇందులో చిన్న, మధ్యతరహా చెరువుల ద్వారా లభించే ఆదాయం సుమారు రూ.6,300 కోట్ల వరకు ఉం టుంది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోకపోవడం   వల్ల ముందుగా చిన్న, మధ్యతరహా చెరువులు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా మత్స్య రంగంపై ప్రభావం పడి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు రూ. 6,000 నుంచి రూ.7,000 కోట్లు కోల్పో యే ప్రమాదం ఉంది. అంతే పరిమాణంలో రాష్ట్ర అవసరాల కోసం చేపలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక పాల ఉత్పత్తిని చూస్తే అసంఘటిత రంగంతో కలిపి ఏడాదికి సుమారు 59.35 లక్షల టన్నులు. అంటే రోజుకు దాదాపు 1.60 కోట్ల లీటర్లు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్, తెలం గాణ పశుసంవర్ధక శాఖ నివేదికల ప్రకా రం, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సొంత వినియోగానికి 35%-- పోను, 60% నుంచి 65% పాలు.. అంటే రోజు కు 95 లక్షల నుంచి 1.05 కోట్ల లీటర్లు మార్కెట్‌లోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 20% తక్కువ ఉత్పత్తి జరుగుతుం ది. 20% తగ్గుదల అంటే రోజుకు 18 లక్షల లీటర్ల కొరత ఏర్పడుతుంది.

సగటున లీటరుకు రూ.50 చొప్పున లెక్కిస్తే, మొత్తం గ్రామీణ పాడి ఆర్థిక వ్యవస్థ రోజు కు రూ.9 కోట్ల మేర నష్టపోతుంది. 9 నెలల పాటు 20% పాల ఉత్పత్తి తగ్గుదల వల్ల వచ్చే ప్రత్యక్ష ఆదాయ నష్టం రూ.2,430 కోట్లు. పెరిగిన మేత ఖర్చులు, పాల నష్టం, పశుసంపద నష్టం అన్నీ కలిపితే సుమారు రూ.6,500 --నుంచి రూ. 8,000 కోట్ల వరకు సంపదను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోల్పోతుంది. అదే సమయంలో రూ.2,430 కోట్ల విలువ చేసే పాలను ఇతర రాష్ట్రాల నుచి దిగుమతి చేసుకోవడం వల్ల తెలంగాణ సంపద ఇత ర రాష్ట్రాలకు తరలిపోతుంది. 

గ్రామీణ ప్రాంతాల్లో పంట లు ఎండిపోతుంటే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో రకమైన విపత్తు ఎదుర వుతోంది.  నగరానికి తాగునీటిని అందిం చే ప్రధాన జలాశయాల్లో నిల్వలు తగ్గిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కోసం నిత్యం హాహాకారాలు చేస్తున్నారు. జలమండలి రోజువారీగా 20,000 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా కోటిన్నర జనాభాకు దేనికీ చాల డం లేదు. ప్రభుత్వ ట్యాంకర్లను బుకింగ్ చేసినా రోజుల తరబడి రాకపోవడంతో, అవసరాల దృష్ట్యా తప్పనిపరిస్థితుల్లో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.

దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ ఏజెన్సీలు ట్యాంకర్‌కు రూ.1,000 నుంచి రూ. 2,000 వరకు వసూలు చేస్తున్నారు.  అక్టోబర్ 31 నాటికి జలమండలిలో రోజూ 20 వేల ట్యాంకర్ల డిమాండ్ ఉంది. ఇవి కాకుండా పూర్తిగా బోరు బావులు ఎండిపోయిన వారు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్ర యిస్తున్నారు. దీంతో రోజుకు అదనంగా మరో లక్ష ట్యాంకుల వినియోగం జరుగుతుంది. ఇందుకోసం నగరవాసులు రోజూ రూ.16 కోట్లు చెల్లించవలసి వస్తుంది. కరువు పరిస్థితులు తొమ్మిది నెలలు కొనసాగే అవకాశముందని నిపుణులు, ప్రభు త్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. అప్పటి వరకు నగర ప్రజలపై నీటి భారం ప్రతి నెలా 20% చొప్పున పెరగనుంది. జూన్ నాటికి ట్యాంకర్ల ద్వారా నీటి కొనుగోలుకు రూ.10 వేల కోట్లు ఖర్చు కానుంది.

గత మూడు వారాల్లో బియ్యం ధరలు క్విం టాకు రూ.4 వేలు పెరిగాయి. దీంతో ప్ర భుత్వ పంపిణీ వ్యవస్థ కాకుండా బియ్యం వినియోగం నెలకు 8 లక్షల టన్నులు.  వినియోగదారులపై నెలవారి రూ.320 కోట్ల అదనపు భారం. రాబోయే ఏడు నెలల కాలానికి రూ.2వేల కోట్ల పైగా భారం ప్రజలపై పడనుంది. ఇంతటి కరువు పరిస్థి తులలో పెరిగిన కరెంట్ బిల్లులు ట్రూఅప్ రూపంలో రూ.7వేల కోట్ల అదనపు భారం ప్రజలపై పడుతుంది. మొత్తంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ప్రజలు నేరుగా కోల్పోయే సంపద రూ.లక్ష కోట్లు దాటుతుంది. ఒక్క తప్పుడు నిర్ణయం ఇంతటి నష్టాన్ని తెచ్చి పెడుతున్నది. 

ప్రభుత్వం ఇప్పటికైనా ఊహాజనిత ప్రకటనలు, రాజకీయ విమర్శలను పక్కనబెట్టి దెబ్బతిన్న వ్యవసాయ రంగం, తాగునీటి వ్యవస్థను పునర్నిర్మించేందుకు తక్షణ ప్రణాళికలను అమలు చేయాలి. ఎల్ నినో ధాటికి పత్తి, వరి పంటలను కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన సన్న, చిన్నకారు రైతులకు ఎకరాకు రూ.20,000 చొప్పున నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. నష్టపోయిన జిల్లాల్లో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే జరిపి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల ఆధారంగా నేషనల్ డిజా స్టర్ రెస్పాన్స్ ఫండ్  నిధులను వెంటనే సాధించి రైతులకు అందజేయాలి. నగరంలోప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల అక్రమ దోపి డీకి అడ్డుకట్ట వేస్తూ కఠినమైన ధరల పరిమితి విధానాన్ని తీసుకురావాలి. అదే సమయంలో కృష్ణా, గోదా వరి ప్రాజెక్టుల ద్వారా తాగునీటి పం పిణీని నిరంతరం కొనసాగించేలా చర్యలు చేపట్టాలి.

అధ్యక్షుడు, తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్)

డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్

మరిన్ని వార్తలు