ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ

17-11-2026 | 08:34pm

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి(Indiramma Family Life Insurance Scheme) ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil ) తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు.

18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్, రేషన్ కార్డులు వెంట తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు