ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం

15-11-2026 | 04:30pm

మునుగోడు, నవంబర్ 15 (విజయక్రాంతి): మండలంలోని ఇప్పర్తి గ్రామానికి(Ipparthi Village) చెందిన పులకరం సైదులు ముదిరాజ్ సంఘం(Pulakaram Saidulu Mudiraj Sangham) నల్గొండ జిల్లా(Nalgonda District) అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం గ్రామంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం(Mudiraj Association) నాయకులు శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ ముదిరాజుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, సామాజిక వర్గానికి ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దోటి సైదులు, జిల్లా స్వామి, పులకరం కిరణ్, బాలకృష్ణ, సైదులు, ఆడెపు వెంకన్న, అనిల్, శివ, శ్రీకాంత్, దోటి వెంకన్న, రామకృష్ణ, లింగస్వామి, పులకరం నరేష్, నరసింహ, మల్లయ్య, జుట్టు అనిల్, నక్కల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు