ఏపీలో కొనసాగుతున్న ‘ఘర్షణల పర్వం’

18-10-2026 | 05:05am
  1. పులివెందులలో టీడీపీ వర్గాల బాహాబాహీ
  2. పోలీసులపైకి రాళ్లు రువ్విన కార్యకర్తలు
  3. గాలిలోకి కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగం

అమరావతి, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల్లో(Local elections in Andhra Pradesh) నామినేషన్ల పర్వం కాస్తా ‘ఘర్షణల పర్వం’గా కొనసాగుతుంది. శనివారం కడప జిల్లా పులివెందులలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తి దాడులకు పరిస్థితులు దారి తీశాయి. దీంతో కల్పించుకున్న పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. గాల్లోకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులు, మీడియా ప్రతినిధులపై కూడా పలువురు రాళ్లు రువ్వడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తతలకు దారితీశాయి.

టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు కారణం మీరంటే మీరేననే ఆరోపణలు చేస్తున్నారు. విషయం టీడీపీ నాయకులకు పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సంఘటనా స్థలానికి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితోపాటు పలువురు చేరుకొని ధర్నాకు దిగారు. నామినేషన్ ప్రక్రియకు వెళుతున్న వారిని అడ్డుకొని పత్రాలు చింపివేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దూషణలు, దాడులు, బెదిరింపులపై చర్యలు తీసుకోకపోతే నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి కార్యాలయం కూడా దాడులు జరిగాయి. కార్యాలయంలో ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. వాహనాలను ధ్వంసం చేయగా, నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి చేతిలో నామినేషన్ పత్రాలను పలువురు టీడీపీ అభ్యర్థులు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.


మరిన్ని వార్తలు