మోదీని నా స్నేహితుడన్న ట్రంప్
ఫిలిప్పీన్స్: మనీలాలో అంతర్జాతీయ దౌత్య సందడి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,(US President Donald Trump,) భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా నాలుగు దేశాల అగ్రనేతలు క్వాడ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీని ట్రంప్ గొప్ప నాయకుడిగా, తన స్నేహితుడిగా అభివర్ణించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా(Manila)లో మంగళవారం 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సమావేశం(ASEAN-India Summit), 21వ తూర్పు ఆసియా సదస్సు జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో క్వాడ్ కూటమి నాయకులు(Quad leaders) సమావేశమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనాయ్ టకైచి ఇందులో పాల్గొన్నారు. మనీలాలోని సోలైర్ రిసార్ట్లో జరిగిన ఈ సమావేశానికి ముందు నలుగురు నేతలు పరస్పరం పలకరించుకుని గ్రూప్ ఫొటో దిగారు. ట్రంప్ రెండో అధ్యక్ష పదవీకాలంలో జరిగిన తొలి క్వాడ్ నాయకుల స్థాయి ప్రత్యక్ష సమావేశం కావడం విశేషం.
సమావేశం ప్రారంభంలో మాట్లాడిన ట్రంప్.. ప్రధాని మోదీని గొప్ప నాయకుడిగా, తన స్నేహితుడిగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు క్వాడ్ కూటమి భారత్కు విశ్వసనీయ భాగస్వామ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాలుగు దేశాల మధ్య పరస్పర సహకారం, నమ్మకం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణ, కీలక ఖనిజాలు, సాంకేతిక పరిజ్ఞానం, సరఫరా వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై సహకరిస్తోంది. ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల సందర్భంగా జరిగిన ఈ సమావేశం ద్వారా నాలుగు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, సురక్షిత వాతావరణాన్ని కొనసాగించడంపై నేతల చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది.