ఎన్విడియాలో పెరిగిన ట్రంప్ సంపద
- రెండేళ్లలో 13 మిలియన్ నుంచి 62 మిలియన్ డాలర్లకు
- మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ పునరాగమనానికి మద్దతు
- పునరాగమనాన్ని తోసిపుచ్చిన బోర్డు
- నెక్ట్స్ సీఈవోపై కొనసాగుతున్న సస్పెన్స్
వాషింగ్టన్, నవంబర్ 17: ఎన్విడియాపై(NVIDIA) వివాదాలు, విమర్శలు, సీఈవో రాజీనామా(CEO Resignation) చేసిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఈ సంస్థలో గత రెండేళ్లలో పెట్టుబడులు భారీగా పెరిగాయని అంతర్జాతీయ మీడియా(International Media) వెల్లడించింది. మంగళవారం వెల్లడించిన మీడియా వార్తా కథనం ప్రకారం.. 2024లో ట్రంప్‌నకు ఎన్విడియాలో 6,15,000 నుంచి 13 లక్షల డాలర్ల వరకు షేర్లు ఉండగా, ప్రస్తుతం వాటి విలువ 13 మిలియన్ డాలర్ల నుంచి 62 మిలియన డాలర్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈ విషయాన్ని ట్రంప్ కూడా బహిర్గతం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. వివాదాల నేపథ్యంలో ట్రంప్ కార్యవర్గం ఎన్విడియాకు సంబంధించిన రెండు ఉత్పత్తులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ సంస్థలో పునరాగమనాన్ని బోర్డు తోసిపుచ్చింది. అతను తిరిగి రావాలని 1,80,000 వేల సంతకాలు, ట్రంప్ మద్దతు లభించినప్పటికీ డైరెక్టర్ల బోర్డు ఆయన్ను సీఈవోగా తిరిగి తీసుకునే డిమాండ్లను పరిగణించడం లేదని సమాచారం.
మరోవైపు జెన్సన్ సంస్థ కార్యకలాపాలు, రహాస్యాలను బయటకు వెల్లడించారా అనే విషయం కూడా బోర్డు సీక్రెట్‌గా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. హువాంగ్ తాను స్థాపించిన ఎన్విడియాలో 33 ఏళ్లపాటు సీఈవోగా పనిచేసిన తరువాత వివాహేతర సంబంధం ఆరోపణలు, అంగీకారం నేపథ్యంలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇతనికి చైనా గూఢచార సంస్థతోనూ దగ్గరి బంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిణామాలు ఇలా ఉండగా, తదుపరి ఎన్విడియా సీఈవో ఎవరన్నదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది.