20-12-2025 08:53:34 PM
కార్పొరేషన్ ఎన్నికలలో బల్దియాపై బిజెపి జెండా ఎగరవేస్తాం...
శక్తి కేంద్ర ఇన్చార్జ్ దొంతు రవి
నిజామాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు కార్యకర్తల సమీకరణ మొదలైంది. 21వ డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జీ, జిల్లా దొంతుల రవి మరియు పోలింగ్ బూతుల డివిజన్ డివిజన్ కన్వీనర్ దోదోల్ల గిరిబాబు అధ్యర్యంలో నూతన పొలింగ్ బూత్ అధ్యక్షులను, పొలింగ్ బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి పోలింగ్ స్థాయి కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారని అదే స్ఫూర్తితో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరేలా పోలింగ్ అధ్యక్షులు మరింత కష్టపడి పని చేయాలని నూతనంగా ఎన్నుకోబడిన వారికి దొంతుల రవి విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్యకర్త లే మూలస్తంభం అని కార్యకర్తలంతా. అంకితభావంతో పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనీ అన్నారు.
21 డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జ్ దొంతులరవి ఆధ్వర్యంలో మండల బూత్ కమిటీల కన్వీనర్ గారి దూదుల గిరిబాబు కమిటీలు వేయడం జరిగింది అధ్యక్షులుగా సతీష్ ప్రసాద్ బొబ్బిలి మహేష్ ప్రవీణ్ రెడ్డి శ్రీనివాస్ అనిల్ కుమార్ అధ్యక్షులుగా జనరల్ సెక్రెటరీ సుధీర్ శ్రీధర్ సెక్రెటరీగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని వారి కోరారు.