02-09-2025 12:00:00 AM
పట్టించుకుని మున్సిపల్ అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 31: రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి 5వ వార్డులో ఉన్న ఐమాక్స్ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. గత మూడు రోజులు క్రితం ఓ డంబర్ లారీ ఐమాక్స్ విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొట్టింది. దీంతో ఆ దిమ్మె విరిగిపోవడంతో.. ఐమాక్స్ విద్యుత్ స్తంభానికి ఎలాంటి సపోర్టు లేకపోవడంతో విరిగిపడి.. ప్రమాదాలు జరిగే అవకాశముంది.
ఈ దిమ్మె విరిగి మూడు రోజులు గడుస్తున్నా... మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి నిత్యం ఈ రహదారి నుంచి వందలాది ప్రయాణీలకు రాకపోకలు సాగిస్తుంటారు. అసలే వర్షకాలం.. వర్షాలతోపాటు.. ఈదురుగాలులతో ప్రమాదం చోటు చేసుకోవచ్చు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి.. వెంటనే ఐమాక్స్ విద్యుత్ స్తంభం దిమ్మెను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.