calender_icon.png 9 September, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల క్రీడల్లో ప్రతిభను చాటిన పొనుగోడు విద్యార్థులు

08-09-2025 09:10:15 PM

క్రీడలలో ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించిన ఉపాధ్యాయులు

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో పొనుగోడు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రభంజనం చాటినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నర్సకుమారి తెలిపారు.సోమవారం పాఠశాల ప్రాంగణంలో వివిధ క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థినీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో చూపించిన ప్రతిభ అమోఘమైందనీ అన్నారు.మండలంలో పొనుగోడు విద్యార్థులు చూపిన ప్రతిభ మన  పాఠశాలకు గర్వకారణంగా నిలుస్తుందన్నారు.

కాగా ఈ పోటీలలో కబడ్డీ అండర్ 14 బాలుర విభాగంలో ప్రథమ స్థానం, కబడ్డీ అండర్ 17 బాలికల విభాగంలో  ద్వితీయ స్థానంతో ప్రతిభ చాటగా, ఖో - ఖో అండర్ 14  బాలికల విభాగంలో ద్వితీయ స్థానం, వాలీబాల్ క్రీడలో  అండర్ 14 బాలుర విభాగంలో ద్వితీయ స్థానం,అండర్ 17 బాలుర విభాగంలో ద్వితీయ స్థానంతో పాటు సాధించారని అన్నారు.అంతేకాకుండా వాలీబాల్ క్రీడలో అండర్ 17 బాలికల విభాగంలో ద్వితీయ స్థానం కైవసం చేసుకుని సత్తా చాటిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఇంతటి క్రీడా విజయాలను అందించడానికి విద్యార్థులకు క్రీడల్లో నైపుణ్యాన్ని అందించి ఏకలవ్యుడిలా శిక్షణ అందించిన క్రీడా ఉపాధ్యాయులు కె రాంప్రసాద్ ని పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.