15-08-2025 05:39:42 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. బెల్లంపల్లి క్యాంపు కార్యాలయం, కాంగ్రెస్ కార్యాలయం, కన్నాల బస్తి, కాల్ టెక్స్, భవిత డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ జాతీయ జెండాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ గెల్లి జయరాం యాదవ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్ట్ లో సివిల్ జడ్జి జె.ముఖేష్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ తన్నీరు రమేష్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహేందర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ దేవేందర్, బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ ఓ శ్రీనివాసరావు, బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై సిహెచ్ కిరణ్ కుమార్ ,బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న, బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రవి లు మువ్వన్నెల జెండాలను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.