15-08-2025 05:41:58 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి సివిల్ జడ్జి జె.ముఖేష్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ చేను రవికుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన న్యాయవాదులు అనిల్ కుమార్, ఇమ్రాన్, సందీప్, నల్లుల సంగీత, శ్రావణ్ కుమార్, మమత లకు సివిల్ జడ్జి బహుమతులను ప్రదానం చేశారు.