calender_icon.png 15 August, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

జెడిఎం మత్తి కొండలరావుకు పలువురి అభినందనలు

15-08-2025 05:35:02 PM

ఖమ్మం(విజయక్రాంతి): ఖమ్మంకు చెందిన మత్తి కొండలరావుకు ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ ఉత్తమ అవార్డు అందజేయటం పట్ల ఖమ్మంకి చెందిన పలువురు అభినందనలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఐటీడీఏ ఏటూరు నాగారంలో ఉత్తమ అవార్డుల కార్యక్రమంలో భాగంగా జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మత్తి కొండలరావుకు కు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రా  చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా కొండలరావును ఖమ్మంకు చెందిన పలువురు ప్రముఖులు ఫోనులో అభినందించారు.

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జి నాగ స్వామి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఖమ్మం కు చెందిన పలువురు కార్పొరేటర్లు, వైద్యులు, లాయర్లు, రాజకీయ నాయకులు కొండలరావు ను అభినందించారు. గిరిజన యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందజేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ నోటిఫికేషన్లకు అనుగుణంగా యువతకు కోచింగ్ లు ఇప్పించటం, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యే వారికి ఐటిడిఎ ద్వారా శిక్షణను అందజేయడం తదితర కార్యక్రమాలలో ప్రతిబి కనపరిచినందుకు ఈ అవార్డు దక్కిందని ఆయన అన్నారు. ఫోన్లో తనను అభినందించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.