calender_icon.png 16 November, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనదుర్గా ప్రాజెక్టు ఎత్తు పెంచాలి

15-11-2025 12:00:00 AM

  1. జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

వనదుర్గమ్మను దర్శించుకున్న కవిత

పాపన్నపేట, నవంబర్ 14 :తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని సంద ర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ప్రాజెక్టును ఆమె సందర్శించి మాట్లాడారు.

తెలంగాణ జాగృ తి జనం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లాను సందర్శించినట్టు ఆ మె పేర్కొన్నారు. వనదుర్గా ప్రాజెక్టును ఎత్తు పెంచితే భవిష్యత్తులో ఆలయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. భక్తులకు సమస్య ఉండదని పేర్కొన్నారు. త్వరితగతిన ఎత్తు పెంచే పనులు ప్రారంభించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.