27 August, 2026 | 10:03 AM

లక్నో అగ్నిప్రమాదం.. 15 మంది సజీవదహనం

23-06-2026 12:03 AM
  1. లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం
  2. 15 మంది మృతుల్లో విద్యార్థులు, ఇతరులు
  3. ఏడుగురికి గాయాలు

పైకప్పుల నుంచి కిందికి దూకిన కొందరు

ప్రాణనష్టంపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం

మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2లక్షలు, రాష్ట్రం రూ.లక్షలు..

క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా

లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 7 మంది గాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

లక్నో, జూన్ 22: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు సజీవదహనం అయ్యారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వాణిజ్య దుకాణంలో మంటలు చెలరేగి.. పైన నడుస్తున్న కోచింగ్ సెంటర్‌కు వేగంగా వ్యాపించి, ఎగిసిపడ్డాయి. దీంతో మంటల్లో విద్యార్థులు, ఇతర వ్యక్తులు చిక్కుకుపోయారు. కొందరు ప్రాణాలను కాపాడుకోవడానికి కిటికీలు, తీగల ద్వారా కిందికి దూకారు.

పెంపుడు జంతువుల క్లినిక్ కూడా ఉన్న ఈ భవనంలో మంటలు వ్యాపించడంతో పలువురు బయటకు దూకేసి ప్రాణాలతో బయ టపడ్డారు. మరికొందరిని స్థానికులు రక్షించా రు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌సా, రాజ్‌నాత్‌సింగ్, డిప్యూటీసీ కేశవ్‌ప్రసాద్ మౌర్య, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ కాంగ్రెస్‌చీఫ్ అజయ్‌రాయ్, రాష్ట్రీ య లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ) ప్రధాన కార్యదర్శి అనిల్ దూబే మృతులకు సంతాపం తెలి పారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కూడా ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా జరిగే బ్రేకింగ్ న్యూస్, విద్య, వ్యాపారం, క్రీడలు, సినిమా మరియు తెలంగాణ తాజా వార్తలను విజయక్రాంతి న్యూస్‌లో నిరంతరం చదవండి.

సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లక్నోలోని అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానియా ప్రాంతంలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న ఈ భవనంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి బృందాలు వాటర్ టెండ ర్లు, అగ్నిమాపక పరికరాలతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి.

మంటలను అదుపు చేయడానికి హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్ వాహనంతో సహా పద్నాలుగు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. అనంతరం, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పౌర రక్షణ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాయి. విషయం తెలిసిన వెంటనే ఉపముఖ్యమంత్రి బ్రజేష్‌పాఠక్, హోంశాఖముఖ్య కార్యదర్శి సంజయ్‌ప్రసాద్, పోలీస్ డైరెక్టర్ జనరల్ రాజీవ్‌కృష్ణ, లక్నో పోలీస్ కమిషనర్ అమరేంద్రసెంగార్‌తో సహా ఉన్నతాధి కారులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు.

సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను, క్షతగాత్రులను కేజీఎంయూ ట్రామా ఆస్పత్రికి తరలించారని డిప్యూటీ సీఎం చెప్పారు. ఆసుపత్రికి 15 మందిని మృతదేహాలను, గాయపడిన ఏడుగురిని తీసుకొచ్చారని, మొత్తం21 నుంచి 22 మం ది పిల్లలను తీసుకొచ్చినట్లు కేజీఎంయూలోని ట్రామాసెంటర్ మెడికల్ సూపరిం టెండెంట్ డాక్టర్ అనిల్‌అగర్వాల్ తెలిపారు.

ప్రాణాలతో బయటపడ్డ కొందరు విద్యార్థులు

ఈ భవనం కోచింగ్ సెంటర్లు, కేఫ్‌లతో సహా వాణిజ్య సముదాయాలు ఉన్న అలీగంజ్ అనే ఉన్నత నివాసప్రాంతంలో ఉంది. ఇది పురానియా మార్కెట్‌కు సమీపంలో ఉంది. జంతుహక్కుల కార్యకర్త కిరణ్ శుక్లా మాట్లాడుతూ.. పెట్‌క్లినిక్‌లోని సుమారు 20 నుంచి 22 కుక్కలు, కుక్కపిల్లలు, డజను పిల్లులు, పిల్లి పిల్లలను రక్షించామన్నారు. మంటలను ఆర్పేశాక, రక్షణ చర్యల్లో భాగం గా బేస్‌ంట్‌లో ఏడు పిల్లులు సజీవంగా ఉన్నాయన్నారు. అయితే మరో ౪ లేదా ౫ పిల్లుల ఆచూకీ లభించలేదన్నారు.

కొంతమంది విద్యార్థులను రక్షించారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అయితే అగ్నిమాపక సిబ్బం ది ఘటనా స్థలానికి చేరుకోవడానికి కొంత సమయం పట్టిందరు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఏడుగురు లేదా ఎనిమిది మంది విద్యార్థులు భవనం పైనుంచి దూకారని మరొకరు తెలిపాడు. అగ్నిమాపక, సహాయక చర్యలు కొనసాగుతుండగానే అక్కడికి వచ్చిన బాధితుల సంరక్షకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

రాష్ట్రపతి ముర్ము సంతాపం

లక్నోలో జరిగిన అగ్రిప్రమాదంలో 15 మంది మృతిచెందడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వివిధ ప్రముఖులు తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరం, హృదయ విదారకమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్రప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మోదీ తెలిపారు.

మీ జిల్లా తాజా వార్తల కోసం Vijayakranti News District News సెక్షన్‌ను సందర్శించండి.

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలీగఢ్‌లో తన పర్యటనను కుదించుకుని లక్నోకు తిరిగి వచ్చారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ఇస్తామని యూపీ సీఎం ప్రకటించారు.

లక్నో అగ్నిప్రమాదంలో ఎంత మంది మృతి చెందారు?

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

గాయపడిన వారు ఎంత మంది?

ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వం ఎంత పరిహారం ప్రకటించింది?

కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

FAQ's

Q1. లక్నో అగ్నిప్రమాదం ఎక్కడ జరిగింది?

లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్ భవనంలో ఈ ప్రమాదం జరిగింది.

Q2. ఎంత మంది మృతి చెందారు?

ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, 7 మంది గాయపడ్డారు.

Q3. ప్రమాదానికి కారణం ఏమిటి?

వాణిజ్య దుకాణంలో చెలరేగిన మంటలు పై అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్‌కు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.

Q4. ప్రభుత్వం ఎలాంటి సహాయం ప్రకటించింది?

కేంద్రం రూ.2 లక్షలు, యూపీ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.

Q5. సహాయక చర్యలు ఎవరు చేపట్టారు?

అగ్నిమాపక సిబ్బంది, NDRF, SDRF, పోలీసు బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి.