calender_icon.png 23 January, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

270 మందికి జైలు శిక్ష

23-01-2026 12:28:05 AM

  1. మందుబాబులకు కోర్టు షాక్

డిసెంబర్ 24 నుంచి 31 వరకు స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ సిటీ బ్యూరో. జనవరి 22 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల జోస్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు హైదరాబాద్ న్యాయస్థానాలు గట్టి షాక్ ఇచ్చాయి. డిసెంబర్ చివరి వారంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో ఏకంగా 270 మందిని దోషులుగా నిర్ధారిస్తూ జైలు శిక్ష విధించాయి. శిక్ష ఖరారైన వెంటనే వారందరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. గతేడాది డిసెంబర్ 24 నుంచి 31 వరకు నగరవ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిం చారు.

ఈ తనిఖీల్లో పట్టుబడిన వారిని కోర్టు లో హాజరుపరచగా, విచారణ అనంతరం న్యాయమూర్తులు ఈ మేరకు తీర్పునిచ్చారు. అలాగే జైలు శిక్ష పడిన వ్యక్తులు పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, వారు చదువుతున్న విద్యాసంస్థలకు పోలీసులు లేఖలు రాస్తున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థల యా జమాన్యాలను కోరుతున్నారు. దీంతో మం దుబా బుల ఉద్యోగాలు, విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

కాగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయిం ట్ కమిషనర్ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ మద్యం సే వించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని, ఇది అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందన్నారు. ఇలాంటి ఉల్లంఘనలను తాము అత్యంత కఠినంగా పరిగ ణిస్తున్నామని, నిందితులకు ఎటువంటి మినహాయింపు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.