వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుకు ముందడుగు

23-04-2024 02:36:17 AM

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): వరంగల్‌లో విమానా శ్రయం ఏర్పాటుకు ముందడుగు పడింది. విమానాశ్రయం నిర్మాణానికై సర్వే చేసేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కసరత్తు మొదలుపెట్టింది. దశాబ్దాల క్రితమే వరంగల్‌లోని మామునూరులో నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ పరి ధిలో 706 ఎకరాల భూమి ఉండ గా.. రీజినల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికై తొలి దశ అభివృద్ధికి సుమారు 400 ఎకరాలు కావాలని ఏఏఐ కోరింది. 253 ఎకరాలను గతేడాది అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి (నిజామాబాద్), బసంత్‌నగర్ (పెద్దపల్లి), కొత్తగూడెం, మా మునూరు (వరంగల్), గుడిబండ (మహబూబ్‌నగర్)లో విమానాశ్రయాల నిర్మాణానికై కేంద్రాన్ని గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.