మన పార్లమెంట్ అభ్యర్థులు వీరే

26-04-2024 02:39:32 AM

హైదరాబాద్

కొంపెల్ల మాధవీలత

కొంపెల్ల మాధవీలత హైదరా బాద్ బంజారాహిల్స్‌లోని విరించి దవాఖా న చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రెండు దశా బ్ధాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బీజేపీ చేపట్టిన ట్రిపుల్ తలాక్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాం కళాశాలలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఉస్మానియా వర్సిటీలో పీజీ (పొలిటికల్ సైన్స్) పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న మాధవీలత ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. 

మహమ్మద్ సమీర్

హైదరాబాద్ టోలి చౌకీకి చెందిన మహమ్మద్ వలీఉ ల్లా సమీర్ 2018 లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ప్రస్తు తం హైదరాబాద్ కాంగ్రెస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 1981లో జన్మించిన ఆయన ఇంటర్ వరకు చదువుకున్నా రు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమీర్ ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గా ప్రకటించడంతో బరిలో నిలిచారు.

గడ్డం శ్రీనివాస్‌యాదవ్

గడ్డం శ్రీనివాస్ యాదవ్.. 1989లో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐలో చేరి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ హైదరాబాద్ నగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా కార్యదర్శిగా కొనసాగారు.  యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

 అసదుద్దీన్ ఒవైసీ

రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అసదుద్దీన్ ఒవైసీ.. ఏఐఎంఐఎం అభ్యర్థిగా 1994 లో తొలిసారి చార్మినార్ నియో జకవర్గం నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో చార్మినార్ స్థానం నుంచే 93 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. హైదరాబాద్ ఎంపీగా, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తన తండ్రి సల్లావుద్దీన్ ఒవైసీ మరణాంతరం పార్టీ బాధ్యతలను స్వీకరించిన అసదుద్దీన్.. ఇప్పటి వరకు నాలుగు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మొదటిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ తర్వా త 2009, 2014, 2019 ఎన్నికల్లో సైతం అసదుద్దీన్ ఎంపీగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా విజయం సాధించారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో సైతం హైదరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. 

సికింద్రాబాద్

జీ కిషన్‌రెడ్డి

రంగారెడ్డి జిల్లాలోని       తిమ్మాపురంలో 1964, జూన్ 15న జన్మించిన గంగ పురం కిషన్‌రెడ్డి బీజేపీలో సామా న్య కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న కిషన్‌రెడ్డి.. 2004 ఎన్ని కల్లో తొలిసారిగా హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. 2009లో అంబర్‌పేట్ నుంచి ఎన్నికై రెండోసారి శాసనసభలో అడుగుపెట్టారు. 2010లో ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడిగా పనిచేశారు. ౨౦౧౪లో అంబర్‌పేట్ నుం చి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ౨౦౧౮ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమిపాలయ్యారు. 2019లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నా రు. ఇప్పుడు మరోసారి  బీజేపీ తరఫున సికిం ద్రాబాద్ లోక్‌సభ బరిలో నిలిచారు. 

దానం నాగేందర్

దానం నాగేందర్.. కాంగ్రెస్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభిం చారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ  నియో జకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి ఆసిఫ్‌నగర్‌లో విజయం సాధించారు. అనంతరం ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉపఎన్నికలో పోటీచేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై వైఎస్‌ఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రోషయ్య మంత్రివర్గంలోనూ కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయా రు. 2018లో కాంగ్రెస్‌కు రాజీనామాచేసి టీఆర్‌ఎస్ లో చేరి ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు.  2023 శాసనసభ ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించా రు. 2024 మార్చి 17న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలో నిలిచారు. 

టీ పద్మారావుగౌడ్

పద్మారావుగౌడ్  1973లో ఇందిరాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరా రు. 1986 నుంచి 1991 వరకు కాం గ్రెస్‌లో కార్పొరేట ర్‌గా పనిచేశారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరా రు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఎన్ని కయ్యారు. 2002 వరకు టీఆర్‌ఎస్ నుంచి కార్పొరేటర్‌గా పనిచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2009లో సనత్‌నగర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎమ్మెల్యే గా విజయకేతనం ఎగురవేసి, మంత్రిగా పనిచే శారు. 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ అభ్యర్థిగా మూడోసారి విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2023 ఎన్నికల్లో నాలుగోసారి సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

మల్కాజిగిరి

ఈటల రాజేందర్

ఈట ల రాజేందర్ 2003 లో టీఆర్‌ఎస్‌లో చేరి రాజకీయ జీవి తాన్ని ప్రారంభించా రు.  2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్ నుంచి ఎమ్మె ల్యేగా  గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలో విజయంసాధించారు. 2009లో హుజూరాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి గెలుపొందారు. 2010 ఉప ఎన్నికలో గెలిచా రు. 2014 ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా పని చేశారు. ౨౦౧౮ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ౨౦౨౧లో టీఆర్‌ఎస్‌లో అంతర్గత వ్యవహా రా నేపథ్యంలో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురవ్వడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 2021 ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

 పట్నం సునీతారెడ్డి

భర్త పట్నం మహేందర్‌రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయరంగ ప్రవే శం చేసిన సునీతారెడ్డి.. 2006లో టీడీపీ తరఫున బంట్వారం జెడ్పీటీసీగా గెలుపొంది రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ౨౦౧౪లో భర్తతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2019లో యాలా ల జెడ్పీటీసీగా గెలుపొంది వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీఆర్‌ఎస్ పార్టీలో నాయకుల మధ్య ఏర్పడిన విభేదా లతో 2024 ఫిబ్రవరిలో పట్నం దంపతులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం సునీతా మహేందర్‌రెడ్డి మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇప్పటివరకు చట్టసభల్లో అడుగు పెట్టని సునీతామహేందర్‌రెడ్డిని మల్కాజిగిరి ప్రజలు ఆదరిస్తారా? లేదా? పార్లమెంట్‌లో అడుగుపెట్టి అధ్యక్షా అంటూ.. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారా? లేదా? చూడాలి మరి.

 రాగిడి లక్ష్మారెడ్డి

రాగిడి లక్ష్మారెడ్డి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుధీర్ఘ కాలంగా రాజకీయ కార్యకలాపాల లో చురుకుగా పాల్గొంటున్నారు. మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో అసహనానికి గురైన రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పేరును బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయని, చట్టసభల్లో ఇప్పటివరకు అడుగుపెట్టని రాగిడి లక్ష్మారెడ్డిని మల్కాజిగిరి ప్రజలు గుర్తిస్తారా? లేదా? అన్నది చూడాలి మరి. ప్రజాప్రతినిధి కావాలనే తన చిరకాల ఆకాంక్ష మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ద్వారా నెరవేరుతుందా? లేదా? లోక్‌సభలో అడుగుపెట్టి అధ్యక్షా అంటూ ఇక్కడి ప్రజా సమస్యలపై స్పందిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉన్నది.

చేవెళ్ల

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

వ్యాపారవేత్త అయిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో 2013 లో టీఆర్‌ఎస్‌లో చేరి రాజకీయ రంగప్రవే శం చేశారు. ఏడాదిపా టు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి  ఎంపీగా విజయం సాధించారు.  ఆ తరువాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో 2018లో కాంగ్రె స్‌లో చేరారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చేవెళ్ల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2022 జూలైలో బీజేపీలో చేరారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. విశ్వేశ్వర్‌రెడ్డి ఆరేండ్ల కాలంలో మూడు పార్టీలు మారారు. ముచ్చటగా మూడోసారి చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి ముడో పార్టీ తరఫున బరిలో నిలిచిన కొండాకు ప్రజలు పట్టం కడుతారా? లేదా? చూడాలి మరి.

 గడ్డం రంజిత్‌రెడ్డి

వరంగల్ జిల్లాకు చెంది న గడ్డం రంజిత్‌రెడ్డి.. ౨౦౧౯లో టీఆర్‌ఎస్‌లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభిం చారు. అదే ఏడా ది చేవెళ్ల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఐదేండ్లపాటు టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన అనూహ్యంగా ౨౦౨౪లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నా రు. ప్రస్తుతం చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన రంజిత్‌రెడ్డి చేవెళ్ల సమీపంలోని అంతాపూర్‌లో పౌల్ట్రీపామ్‌కు సాంకేతిక సలహాదారుడిగా తన వ్యాపా ర జీవితాన్ని ప్రారంభించి, స్థానికంగా మంచి పరిచయాలు పెంచుకున్నారు. ౨౦౧౯లో కొం డా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడటంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనూహ్యంగా రంజిత్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం చేవెళ్ల ఎంపీ గా ఉన్న రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి మరి. 

కాసాని జ్ఞానేశ్వర్

మేడ్చల్ జిల్లా బాచుపల్లికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్‌తో 1987లో రాజకీయ జీవితం ప్రారంభించారు. కుత్భుల్లాపూర్ ఎంపీపీగా పనిచేశారు. 2001లో టీడీపీలో చేరి జడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 2005 తర్వాత ముదిరాజ్ సంఘం, 93 బీసీ కులాల ఐక్య వేధికను స్థాపించి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా రు. అనంతరం ‘మన పార్టీ’ పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించి 2009లో చేవెళ్ల అభ్యర్థిగా, 2018లో మహాకూటమి అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2022లో టీడీపీలో చేరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తూనే.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముం దు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటివరకు ఐదు రాజకీయ పార్టీలు మారిన కాసాని ఎంపీపీగా, జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పకీ ఎంపీ కావాలనే ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఈ సారైనా కాసాని పార్లమెంట్‌లో అధ్యక్షా అంటారో? లేదో? చూడాలి మరి.

మహబూబ్‌నగర్

డీకే అరుణ

1996 లో టీడీపీ తరఫున మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన డీకే అరుణ ఓడిపో యారు. 1998లో కాంగ్రెస్ నుంచి బరి లో నిలిచినా మరోసారి చేదు అనుభవమే ఎదు రైంది. 1999 గద్వాల నుంచి అసెంబ్లీకి పోటీచేసి టీడీపీ అభ్యర్థి గట్టు భీముడు చేతిలో ఓడిపోయా రు. 2004లో గద్వాల కాంగ్రెస్ టికెట్ రాకపోవ డంతో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. 2007లో సామాజ్ వాదీ నుంచి బహిష్కరణకు గురయ్యా రు. 2009లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి విజయం సాధించి, మంత్రి గానూ పనిచేశారు. 2014లోనూ గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2018లో ఓట మిపాల య్యారు. 2019లో అమిత్‌షా సమక్షంలో బీజేపీ లో చేరి, మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపా ధ్యాక్షురాలిగా ఉన్న ఆమె లోక్‌సభకు పోటీచేస్తున్నారు.

వంశీచంద్‌రెడ్డి 

2000  వరకు హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ ఎన్‌ఎస్‌యూ ఐ అధ్యక్షుడిగా పనిచే సిన చల్లా వంశీచంద్ రెడ్డి.. ఆ తరువాత ఏడాది ఎన్‌ఎస్ యూఐ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా భాద్యతలు నిర్వర్తిం చారు. 2012 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షు డిగా పనిచేశారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధిం చారు. 2019 నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పటివరకు కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐలో చురుకైన నాయకుడిగా, ఒక సారి ఎమ్మెల్యేగా పనిచేసిన చల్లా వంశీచంద్‌రెడ్డికి ఎంపీ కావాలనే  ఆకాంక్ష నెరవేరుతుందా? పార్లమెంట్‌లో అధ్యక్షా అంటారో లేదో చూడాలి మరి.

మన్నె శ్రీనివాస్‌రెడ్డి

మహ బూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండ లం గురుకుంటకు చెందిన మన్నె శ్రీని వాస్‌రెడ్డి 2005లో కాంగ్రెస్ పార్టీ నుంచి సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో గురుకుంట ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసి గెలు పొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో మరో సారి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీతో  రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మన్నె శ్రీని వాస్‌రెడ్డి.. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీ అయ్యారు. మరోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్ల మెంట్ పోరులో నిలిచారు. ప్రస్తుతం జరుగుతున్న త్రిముఖ పోరులో రెండోసారి కూడా లోక్‌సభలో అడుగుపెట్టి అధ్యక్షా అంటూ.. పాలమూరు ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మార్గం చూపుతారో? లేదో? చూడాలి మరి.

నాగర్‌కర్నూల్

పీ భరత్‌ప్రసాద్

పోతు గంటి భరత్ ప్రసాద్.. నాగర్‌కర్నూల్ ప్రస్తుత ఎంపీ పోతు గంటి రాములు కుమా రుడు. 2007లో టీడీపీ లో చేరి రాజకీయ ప్రయాణం ప్రారంభిం చారు. తండ్రి రాములు వెంట నడిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 సంవత్సరంలో తండ్రితో కలిసి తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2019లో కల్వకుర్తి (ఎస్సీ) నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2023లో జరిగిన అసెం బ్లీ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామా ల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. భారత ప్రభుత్వం కోసం నేషనల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పైలెట్ ప్రాజెక్టు కోసం పనిచేశారు. పీఎస్‌ఎల్వీ కోసం కమ్యూనికేషన్ సైం టిస్ట్‌గా డీఆర్డీఎల్, డీబీఎల్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు. పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత కోసం ఎన్జీవోలో పనిచేశారు. ప్రస్తుతం నాగర్‌కర్నూ ల్ (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

మల్లు రవి

ఖమ్మం జిల్లా ఎస్ లక్ష్మీపురంలో పుట్టి న మల్లు రవి.. గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్య సించా రు. 1980 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ డాక్ట ర్స్ వింగ్ కన్వీనర్‌గా పనిచేస్తూ రాజకీయ ప్రస్థానం ప్రారంభిం చారు. 1991లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి లోక్‌సభకు ఎన్నిక య్యారు. 1998లో మరోసారి నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ౧౯౯౯లో నాగకర్నూల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తెలంగాణ ఉద్యమ సమ యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజీనామా చేయ గా, ౨౦౦౮లో జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో మల్లు రవి విజయం సాధించారు. ౨౦౦౯లో మహా కూటమి అభ్యర్థిగా జడ్చర్ల నుం చి పోటీచేసి ఓడిపోయారు. ౨౦౧౪లో జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూ శా రు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ స్థానానికి పోటీపడుతున్నారు.

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కు చెందిన రేపల్లె శివ (ఆర్‌ఎస్) ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, 2021 ఆగ స్టు 8న బీఎస్పీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ.. సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ౨౦౨౪ మార్చి 18న బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఐపీఎస్‌గా ఆయన చేసిన సేవలకు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సెక్యూరిటీ మెడల్ (కేంద్ర హోంశాఖ), యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ (వార్ క్రైం ఇన్వెస్ట్‌గేటర్) సాధించారు. అనంత రం తెలంగాణ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం నాకర్‌కర్నూల్ (ఎస్సీ) పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించడంతో లోక్‌స భ ఎన్నికల్లో పోటీపడుతున్నారు.