మల్కాజిగిరిలో విజయం నీదే రాజన్న!l

27-04-2024 01:24:12 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మల్లారెడ్డి తీరుతో బీఆర్‌ఎస్ శ్రేణులలో అయోమయం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26  (విజయక్రాంతి): వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన ఓ ఇద్దరు నాయకులు ఓ పెండ్లి వేడుకలో కలుసుకున్నారు. ఒకరినోకరు పలుకరించుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చి.. కౌగిలించుకున్నారు. అంతటితో ఊరుకోకుం డా ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన పార్టీ అభ్యర్థిని కాదని.. మరో పార్టీ అభ్యర్థిని పట్టుకొని నీవే గెలుస్తావుపో అని బాహాటంగానే చెప్పాడు. దీంతో ఈ ఇద్దరు నాయకుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని కొంపల్లిలో శుక్రవారం జరిగిన ఓ పెండ్లి వేడుకకు మల్కాజి గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హాజరయ్యారు.

అదే పెండ్లికి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఈ ఇద్దరు నాయకులు ఆ వేడుకలో ఒకరినొకరు ఎదురు పడ్డారు. మల్లారెడ్డి స్వయంగా ఈటల రాజేందర్‌ను మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు ? మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో విజ యం నీదే రాజన్న అంటూ ఆలింగనం చేసుకున్నాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వు లు పూసినప్పటికీ.. రాజకీయంలో మాత్రం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే పార్లమెం ట్ పరిధిలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ ఉండటంతో పాటు మల్కాజిగిరి అసెంబ్లీ ఎమ్మెల్యేగా రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.

ఈయన మల్లారెడ్డికి అల్లుడు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉండగా మల్లారెడ్డి తన పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డిని కాదని, బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ విజయం సాధిస్తాడని, నీదే విజ యం అంటూ అతనితో చెప్పడంతో మల్కాజిగిరి బీఆర్‌ఎస్ నాయకులు మల్లారెడ్డి తీరుపై మండి పడుతున్నారు. అయితే మల్లారెడ్డి సరదాగా అన్నాడా..? లేక ఉద్దేశపూర్వ కంగానే అన్నాడా..? అనేది స్పష్టత రావాల్సి ఉంది. కానీ మల్లారెడ్డి ఈటలతో చెప్పిన మాటలు నిజం అవుతాయా లేదా అనేది మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.