05-07-2025 11:28:23 PM
ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి(Correspondent Puligari Govardhan Reddy) సూచించారు. శనివారం కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్లో ఎన్ సీసీ క్యాడెట్ శిక్షణ పూర్తి చేసిన తర్వాత సైనిక అధికారులు పాఠశాల ఎన్సీసీ విద్యార్థులకు ’సీ’ సర్టిఫికెట్లు ఇచ్చి రక్షణ సేవలలో చేరేలా ప్రోత్సహించారు.