calender_icon.png 14 September, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీహరి మృతి పట్ల మంత్రి పొన్నం, కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల సంతాపం

14-09-2025 10:51:43 AM

కరీంనగర్ (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు కర్ర శ్రీహరి ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కర్ర శ్రీహరి సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నో పదవులు చేసిన ఒక నిబద్ధతగా ప్రజల కోసం పని చేశారని గుర్తు చేసుకున్నారు. కర్ర శ్రీహరి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆకుల ప్రకాష్, బీబర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జి వి రామకృష్ణ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్మ్యన్ రావు, బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు డాక్టర్ పి. రవీందర్ రావు, పి. దేవేందర్ రావు తదితరులు వేరు వేరు ప్రకటనలలో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.