15-09-2025 01:01:02 AM
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎంబీ నర్సారెడ్డి
భద్రాచలం, సెప్టెంబర్ 14, (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో సెప్టెంబర్ 22, 23 తేదీలలో జరిగే భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చే యాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం పీ నర్సారెడ్డి జిల్లా నాయకులు వెంకట రా మారావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బండారు చందర్రావు భవన్ నందు లంక శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జరిగిన భద్రాద్రి మార్బులు వర్కర్స్ యూనియన్ మహాసభలో ముఖ్య అతిథులుగా హా జరైన ఎంబి నర్సారెడ్డి , వై వెంకట రామారావులు, మహాసభను ఉద్దేశించి మాట్లా డుతూ మొదటిసారిగా భవన నిర్మాణ సం ఘం రాష్ట్ర మహాసభలు భద్రాచలంలో ఈనె ల 23 24 తేదీల్లో జరగనున్నాయని అన్నా రు.
ఆ మహాసభలలో మార్బుల్ రంగ కార్మికులు భాగస్వాములై విజయవంతం చేయా లని కోరారు. భవన నిర్మాణరంగం కార్మికులు సరైన పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారందరికీ వెల్ఫేర్ బోర్డు ద్వారా గుర్తింపు కార్డులు ఇప్పించాలని వారందరికీ పని కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులన్నీ టిని తుంగలో తొక్కుతూ కార్మిక చట్టాలు అన్నిటిని రద్దుచేసి4 కార్మిక కోళ్లు తీసుకొచ్చి కార్మి కులకు తీవ్రమైన అన్యాయం చేసిందని అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులందరూ సంగటితంగా రాబోయే కా లంలో వారి హక్కుల కోసం పోరాటాలు చే యాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కా ర్మికుల వెల్ఫేర్ బోర్డుకి ఉన్నటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు, ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నదని దాని వలన అనేకమంది కార్మికులకు రావలసినటువంటి క్లే ములు పెండింగ్లో ఉన్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. భ వన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అ నేక రకాల సమస్యలపై ఈ నెలలో జరగబో యే రాష్ట్రమహాసభ లలో తీర్మానాలు చేస్తారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులంద రూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ మహాస భలను జయప్రదం చేయాలని భద్రాద్రి మా ర్బుల్ వర్కర్స్ యూనియన్ 6వ మహాసభలో వారు పిలుపునిచ్చారు .ఈ కార్యక్ర మంలో భద్రాద్రి పెయింటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్.కె జాకీ, భద్రాద్రి మార్బుల్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాష, పాల్వాయి మధు,సురేష్, ప్రసాద్ ,చంటి, వెంకటేష్ ,కాజా , హుస్సే న్, రాయుడు , రా మావతరు తదితరులు పాల్గొన్నారు.