15-09-2025 01:02:29 AM
మణుగూరు, సెప్టెంబర్ 14, ( విజయక్రాంతి) : పగిడేరు గ్రామంలో నీ జియోథర్మల్ ప్రాజెక్టును ఆదివారం సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్, ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు, ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, ఓఎన్జిసి డైరెక్టర్ ఆఫ్ జనరల్ సునీల్ కుమార్, ఆ సంస్థ జి ఎం లు మాయల్, కిరణ్ తో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం 20 కిలో వాట్స్ వి ద్యుత్ ఉత్పత్తి సామర్ధ్య పెంపుకు అవకాశాలు పరిశీ లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం డైరెక్టర్ వెంకటేశ్వర్లు పీ కే ఓసి 2 గనిని సందర్శించి వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీ లించారు. భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగకుండా ఓపెన్ కాస్ట్ గనులలో చేరే వర్షపు నీరుని బయట పంపే విధంగా చర్యలు చేపట్టాలని, బొగ్గు రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏరియా జి ఎం రాంచందర్, ఉన్నత అధి కారులు కనకయ్య, శ్రీనివా స్,పంకజ్, ఏరియా అధికారులు శ్రీని వాస్, వీరభద్రరావు, శ్రీనివాస్ , బిఎ స్ రావు, వీర భద్రు డు,దయాకర్,సురేష్, బబ్బుల్ రాజ్ పాల్గొన్నారు.