15-09-2025 01:00:39 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): నవకర్ ఆధ్వర్యంలో నవకర్ నవరాత్రి ఉత్సవ్ 2025 సీజన్ 8 వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. మనేపల్లి జ్యువెలర్స్, అన్విత సమర్పణలో నిర్వ హించబోయే ఈ నవరాత్రి ఉత్సవ్ 2025, ఈ నెల 22 నుంచి అక్టోబర్ 1 తేదీ వరకు నగరంలోని నెక్లెస్ రోడ్డులో గల జలవిహార్ ప్రాంగణంలో జరుగనుంది.
అధికారిక ఎం ట్రీ పాస్ పోస్టర్‌ను ప్రముఖ బాలీవుడ్ గర్బా కొరియోగ్రాఫర్ జిగర్ సోనీ, ఆర్గనైజర్లు కవిత సలోని జైన్, గుజరాతి సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జిగ్నేష్ దోషీ, అన్విత బిల్డర్ అచ్యుత్ రావు, మనేపల్లి జ్యువెలర్స్ గోపీ, సుమన్ సారాఫ్ -రాధా టీఎంటీ, ఫైన్క్యాబ్ నుంచి బ్రిజ్ భుతాడా అనూప్ చండక్, ఖలీక్‌ఉల్ రెహమాన్ తదితర ప్రముఖులు జలవిహార్‌లో ఆదివారం ఆవిష్కరిం చారు.
అంతకు ముందు బాలీవుడ్ గర్బా కొరియోగ్రాఫర్ జిగర్ సోనీ యువతులకు గర్భా, దాండియా నృత్యం పై వర్క్ షాప్ ను నిర్వహించారు. డాన్స్‌పై మెలకువలను నేర్పించారు. ఈ సందర్భంగా యువతులు గర్బా, డాండి యా నృత్యాలను ప్రదర్శించా రు. సంప్రదాయ గర్భా .. డిజే మ్యూజిక్ హో రులో దాండియా ఆటలతో కనువిందు చేశా రు.
అనంతరం నిర్వాహకులు కవిత సలోని జైన్ లు మాట్లాడుతూ, సంగీతం, నృత్యం, సంప్రదాయాలు, గ్లామర్ సమ్మేళనంగా వేడుకను ఉంటుందని తెలిపారు. ఈ ఉత్సవంలో ప్రతి రోజు మహా ఆర్తి, లైవ్ ఢోలు, వైవిధ్యమైన ఫుడ్ కోర్ట్, సెలబ్రిటీ సందర్శనలతో పా టు ప్రత్యేక బహుమతులు ఉంటాయన్నారు.