calender_icon.png 15 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది ఎప్పటికీ మిగిలిపోయే జ్ఞాపకం

15-09-2025 12:57:40 AM

పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కాకముందు ఒప్పుకున్న సినిమాలన్నీ ఒక్కొటొక్కటీ పూర్తి చేస్తున్నారు. దీంతో ఆయన ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాల కన్నా సినిమా సెట్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ‘ఓజీ’ సినిమా షూటింగ్ పూర్తిచేశారు పవర్ స్టార్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమా ఇదే నెల 25వ తేదీన విడుదల కానుంది. ఇక పవన్ చేతిలో మిగిలిన మరో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాశీఖన్నా పవన్ కళ్యాణ్‌తో దిగిన సెల్ఫీని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన అప్‌డేట్ కూడా ఇచ్చిందీ బ్యూటీ. “ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించి పవన్‌కళ్యాణ్ గారి షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో ఆయనతో కలిసి పనిచేయడం ఒక అద్భుతం. ఇది ఎప్పటికీ ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది” అని రాసుకొచ్చింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయిందని తెలుస్తోంది. ఇక పవన్‌కళ్యాణ్ లేని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది.

మిగతా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తిచేసి, 2026లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రాశీఖన్నా.. పవన్‌తో దిగిన సెల్ఫీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు రాశీఖన్నా.. సిద్దు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’లో జోడీ కడుతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల కాగా ఇందులో సిద్దుతో ఈ అందాల ‘రాశీ’ చేసిన రొమాన్స్ కుర్రకారు కళ్లల్లో ఇంకా తిరుగుతోంది. ఇలా ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది.