06-01-2026 01:28:37 AM
శాసనసభలో మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి) : పర్యాటకంలో కేరళ రాష్ట్రంతో పోటీ పడేలా తెలంగాణ పర్యాటకాన్ని తీర్చిదిద్దుతున్నామని, రానున్న రోజుల్లో పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయం లో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి సమాధానం ఇచ్చారు. అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, పాయల శం కర్, మీర్ జుల్ఫికర్ అలీ అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన పర్యాటక విధానం 2025- 2030 తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. పర్యాటక రం గాన్ని పీపీపీ మోడల్ లో అభివృద్ధి చేసేందుకు దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక కేం ద్రంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆ రంగం వాటాను పెంచడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం నిబద్ధతో పని చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
‘కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ వాటర్ స్పోర్ట్స్, బో టింగ్ సదుపాయం కోసం ఏర్పాట్లు చేస్తు న్నాం. కౌలస్ కోట, నాగన్నమెట్ల బావి అభివద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం, డిచ్‌పల్లి రామాలయం అభివృద్ధికి పర్యాటక పరంగా ఉన్న అవకాశాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి అమలు చేస్తాం. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియా టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సాఆర్‌ఎస్పీ రిజర్వాయర్ లో బోటింగ్ సదుపాయం, హరిత హోటల్ పునరుద్ధరణ, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మం డల కేంద్రంలోని దేశంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీలక్ష్మీనరసింహ స్వా మి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేం ద్రంగా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి గుడి చెరువు అభివృద్ధి, బోటింగ్ సదుపాయం, రోప్ వే ఏర్పాటు గురించి అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం.
సిరిసిల్లలో హరిత హోటల్ పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్‌లోని చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ వంటి చారిత్రక, వారసత్వ ప్రదేశాలకు దేశ. విదేశీ పర్యాటకులను ఆకర్శించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.