calender_icon.png 9 August, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్‌కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారి

09-08-2025 12:15:42 AM

గద్వాల, ఆగస్టు 08 ( విజయక్రాంతి ) : రాఖి పండుగ సందర్భంగా, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్రహ్మకుమారి సోదరీమణు లు కలెక్టర్ గారిని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలసి రాఖీని కట్టారు. సోదరభావం , సమాజంలో శాంతి, ఐక్యతల కో సం ఈ రాఖీ పండగ ప్రతీకగా నిలుస్తుందని వారు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ బ్రహ్మకుమారి సోదరీమణుల ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ,రాఖీ పండుగ మ న సమాజంలో ప్రేమ, పరస్పర విశ్వాసం, ఐక్యతను మరింత బలపరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారిలు మంజుల,నర్మద,లక్ష్మి రాజ్యం, తిరుపతి రెడ్డి, విక్రమ్ సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.