09-08-2025 01:23:14 AM
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఉమ్మడిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం విడి రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధానమైన సమస్య జల వివాదాలే. ఏళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సాగు నీరు అందించడం లో తీవ్రంగా నష్టం వాటిల్లింది.
అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నీటి పంపకాల సమస్యలపై స్పష్టత వచ్చినప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వాటికి పరి ష్కారం మాత్రం లభించడం లేదు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభించిన విధానాలతోనే సాగు నీటి రంగంలో తెలంగాణ ఎంతో నష్టపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జలవివాదాల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కేంద్రజల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇరురాష్ట్రాల సీఎంలు, నీటిపారుదల శాఖ మంత్రులు, కార్యదర్శులు సహా ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై చర్చించారు. పరిష్కారం కోసం 12 మంది సభ్యులతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున అధికారులను సభ్యులుగా నియమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. కానీ రోజులు గడుస్తున్నా జల వివాదాల పరిష్కార కమిటీ ఏర్పాటుపై స్పష్టత రావడం లేదు.
బనకచర్లతోనే అసలు సమస్య
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు రోజురోజుకూ జఠిలం అవుతున్నాయి. జలవివాదాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో నీటి వివాదం మరింత ముదిరింది. బనకచర్లను నిర్మిస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం వివరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది.
అదే సమ యంలో కేంద్రం స్పందించకుంటే న్యాయస్థానాల వరకూ వెళ్తామని హెచ్చరించింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కార మార్గాలు చూపెట్టాలని కేంద్రం భా వించింది. గత జూలైలో రెండు రాష్ట్రాల ము ఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన భేటీకి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరు రా ష్ట్రాల అధికారులు హాజరయ్యారు.
12 మందితో కమిటీ
అయితే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు కేం ద్రం కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుం ది. ఈ కమిటీ కేవలం బనకచర్ల మీదనే కా కుండా ఇతర అన్ని సమస్యలపైనా స్టడీ చేసి పరిష్కారం చూపనుందని స్పష్టం చేశారు. మొత్తం 12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోగా.. అందు లో ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురి చొప్పున పేర్లు పంపించాలని సూచించారు.
ఇరు రాష్ట్రాల నుంచి పది మందిని ఎంపిక చేసి.. కేం ద్రం తరఫున మరో ఇద్దరు నిపుణులను కమిటీలో చోటు కల్పించాలని భావించారు. అయితే ఈ కమిటీకి సభ్యులను ఎంపిక చేసే విషయంలో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఆచీతూచి వ్యవహరిస్తున్నది. రాష్ర్ట భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఎవరెవరిని నియమించాలనే దానిపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే ఏపీ సభ్యుల ఖరారు
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తమ సభ్యుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇం దులో ఏపీ ఇరిగేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వర్‌రావు, ఈఎన్సీ నరసింహా మూర్తితో పాటు మరో ఇద్దరి పేర్లు ఖరారైన ట్లు సమాచారం. సాంకేతిక చర్చల్లో తమ రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుం డా ఈ వ్యూహాన్ని ఇరు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలుస్తోంది.
ఇరు రాష్ట్రాల మధ్య జల జగడానికి చెక్ పెట్టేందుకు కేం ద్రం కమిటీని ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల పేర్లను జులై 21వ తేదీలోపే పంపించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కోరింది. కానీ ఏపీ ప్రభుత్వం పేర్లను ఖరారు చేసినా కేంద్రానికి పంపించలేదు. ఇటు తెలంగాణలో ఇంకా టెక్నికల్ కమిటీకి సంబంధించిన సభ్యులను ఇంకా ఖరారు చేయలేదు. అయితే సభ్యులను ఎంపిక చేసేందుకు కేంద్ర జల్‌శక్తి నిర్దేశించిన గడువు ముగిసినా తెలంగాణ, ఏపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
వేచి చూసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టెక్నికల్ కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే స మావేశం అనంతరం ఏపీ నీటిపారుదల శా ఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో క మిటీకి సంబంధించి గందరగోళం నెలకొ ంది. బనకచర్ల అంశానికి పరిష్కారం చూపేందుకే టెక్నికల్ కమిటీ ఏర్పాటని రా మానాయుడు చెప్పారు.
సమావేశంలో బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో పరిష్కార కమిటీ కూడా స మస్యాత్మకంగానే మారింది. మొదటి నుంచి ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్లను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం నిపుణుల క మిటీకి రాష్ర్టం నుంచి పేర్లు పంపితే బనకచర్లకు ఒప్పుకున్నట్లే అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోం ది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టె క్నికల్ కమిటీకి పేర్లను పంపించడంలో వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నట్టు సమాచా రం. తెలంగాణలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టెక్నికల్ కమిటీకి రాష్ర్టం నుంచి అధికారుల పేర్లు పంపే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే కమిటీ ఏర్పాటు కోసం ఇరు రా ష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున పేర్లను పంపిస్తే కేంద్రం తరఫున ఇద్దరు నిపుణులను ఎంపిక చేసి తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.