calender_icon.png 25 January, 2026 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడక జోష్..హెల్తీ జ్యూస్!

25-01-2026 12:24:04 AM

  1. మంచిరేవుల పార్కులో వ్యాయామం

ఆరోగ్యంపై మార్నింగ్‌వాకర్స్, సిటీజనం ప్రత్యేక శ్రద్ధ

బండ్లగూడ జాగీర్, విజయక్రాంతి: నాలుగు పదుల వయసు దాటిన వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.. మానసిక  ఒత్తిడి, ఉరుకులు పరుగుల జీవితాలతో సిటీలైఫ్‌లో బిజీగా ఉండే ఉద్యోగులు వ్యాపారులు, రాజకీయ ప్రము ఖులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుం టున్నారు. మిత ఆహారంతో పాటు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే వివిధ రకాల జ్యూస్‌లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు..

మంచి రేవుల గ్రామ శివారులోని పార్కులో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిలుకూరు రిజర్వు ఫారెస్ట్  అధి కారులు మార్నింగ్ వాకర్స్ కోసం ఇక్కడ అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. పార్కులో వాకింగ్ ట్రాక్‌తో పాటు ట్రిక్కింగ్ యోగా సెంటర్, ప్రకృతి సహజమైన ఇతర వసతులతో పాటు జిమ్‌ను ఏర్పాటు చేశారు. నార్సింగి, మంచిరేవుల, కోకాపేట, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ జిల్లా నుంచి ప్రతిరోజు దాదాపు వెయ్యి మంది దాకా మార్నింగ్ వాకర్స్‌తో పాటు ఐటీ ఉద్యోగులు పార్కుకు వస్తుంటారు.

శని ఆదివారాలు పెద్ద మొత్తంలో ఉద్యోగులు చిన్నారుల తో కలిసి పార్కుకు వచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతున్నారు. మంచిరేవుల పార్కు లో ఒక సంవత్సరం వాకింగ్ చేస్తే ఐదు సం వత్సరాల ఆయుష్షును పెంచుకోవచ్చని నల్గొండ జిల్లాకు చెందిన ఎడ వెల్లి వెంకట్రాంరెడ్డి తెలిపారు. 2021 సంవత్సరంలో దాదాపు వివిధ రకాలైన లక్ష మొక్కలను నాటారని ఆయన పేర్కొన్నారు.

‘కరోనా కంటే ముందు నుంచి ఫారెస్ట్ పార్కులో వాకింగ్ చేస్తున్నాం. గత ఆరు నెలల నుంచి పార్కు బయట ఉన్న జ్యూస్ సెంటర్‌లో గుమ్మడికాయ, బీట్రూ ట్, సోరా, కీరా జ్యూస్‌ను తీసుకుంటున్నాం. ఆరోగ్యం కాపాడుకుం టున్నాం’ అని మంచిరేవులలో నివాసం ఉండే మహబూబ్‌నగర్ జిల్లా అన్నసాగర్‌కు చెందిన ఆల రవీందర్‌రెడ్డి తెలిపారు.