25-01-2026 12:24:58 AM
సుస్థిర నగరాల కల్పనపై సదస్సులో వక్తలు
ఏఐపీసీ ఆధ్వర్యంలో కార్యక్రమం
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పట్టణ, నగరాభివృ ద్ధిలో పర్యావరణ సమతుల్యతే ప్రాధాన్యతగా ఉండాలని ఆల్ ఇండియా ప్రొఫెషన ల్స్ కాంగ్రెస్(ఏఐపీసీ) తెలంగాణ- అర్కిటెకట్స్ డొమైన్ పిలుపునిచ్చింది. రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ లోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ వేదికగా సుస్థిర నగరాల కల్పన, పట్టణీకరణ సుస్థిరతపై ప్రత్యేక సద స్సు నిర్వహించింది. ఈ సదస్సులో విధాన నిర్ణేతలు, పట్టణ నిపుణులు, ఆర్కిటెక్టులు, పర్యావరణ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల నాయకులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసి యేషన్లు, పౌర ప్రతినిధులు పాల్గొని తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పట్టణ అభివృ ద్ధి భవిష్యత్తుపై చర్చించారు.
తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ విజన్ 2047 ఆశయాలకు అనుగుణంగా ఈ సదస్సు పట్టణ అభివృద్ధిని కేవలం మౌలిక సదుపాయాల విస్తరణ లేదా ఆర్ధిక వృద్ధితో మాత్రమే కాకుండా, మానవ సంక్షేమం, పర్యావరణ సమతుల్యత, సామాజిక సమానత్వం, సాంస్కృతిక నిరంతరత, దీర్ఘకాలిక స్థిరత్వం వంటి అంశాలను కూడా ప్రాధాన్యతగా తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పట్టణాల రూపకల్పనలో నాణ్యమైన జీవన ప్రమాణాలు మొదటి ప్రాధాన్యతగా ఉండాలని సూచించారు.
2015లో ఆమోదించబడి న ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను అందరూ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రమాదాలు కూ డా పొంచి ఉంటున్నాయని, వీటికి పరోక్షంగా మనమంతా కారకులుగా మారుతు న్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదస్సులో ఏఐపీసీ తెలంగాణ స్టేట్ గెడ్ సుజనా రెడ్డి కుంభం, మహీంద్ర యూనివర్సిటీ ప్రొ ఫెసర్ అనిర్బాన్ ఘోష్, పర్యావరణ వేత్త బీవీ సుబ్బారావు, ఏఐపీసీ హెల్త్ కేర్ డొమై న్ స్టేట్ హెడ్ డాక్టర్ కవితారెడ్డి, గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి శీతల్, రాంకీ గ్రూప్ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు.