calender_icon.png 5 August, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలాహలంగా అభివృద్ధి పనుల జాతర

05-08-2025 12:38:09 AM

ఒక్కరోజే రూ.665.81కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సావాలు

ఆదర్శ నియోజకవర్గాల నిలిపేందుకు అనునిత్యం తపన 

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం/చుంచుపల్లి/సుజాతనగర్ ఆగస్టు 4, (విజయ క్రాంతి)రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అనునిత్యం తపన పడుతున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే నేని సాంబశివరావు అన్నారు.కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో ఒక్కరోజే రూ కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

కొత్తగూడెం పట్టణంలో జెన్కో సి ఎస్ ఆర్ నిధులు రూ 1 కోటితో నిర్మించనున్న బీసీ బాలికల భవన సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కరోజే 103 పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగాయని లక్ష్మీదేవి పల్లె మండలం పరిధిలోని సాటివారిగూడెం చాతకొండ హమాలీ కాలనీ సంజయ్ నగర్ అశోక్ నగర్ పంచాయతీలో రూ కోట్లు, చుంచుపల్లి మండలంలో రూ 64 లక్షలు, సుజాతనగర్ మండలంలో రూ.87.37 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.

ప్రజలకు మౌలిక వసతులు కల్పించేంతవరకు విశ్రమించబోమన్నారు. గ్రామాలు బస్తీల్లో అభివృద్ధి నిధులు కేటాయింపులో ఎలాంటి వ్యత్యాసం ఉండబోదని ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని, భరత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా గ్రంథాలయ వేరు చైర్మన్ వీరబాబు సొసైటీ చైర్మన్ హనుమంతరావు కార్పొరేషన్ కమిషనర్ సుజాత ఈ ఈ వెంకటేశ్వరరావు బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర పంచాయతీరాజ్ డిఇ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.