calender_icon.png 5 August, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం

05-08-2025 12:36:04 AM

  1. పార్కులకు ప్రాణం పోస్తాం
  2. హైడ్రా కమిషనర్ రంగనాథ్
  3. హైడ్రా ప్రజావాణిలో భూకబ్జాలపై 58 ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): పార్కులు, రహదారులు, ప్ర జావసరాల కోసం కేటాయించిన స్థలాలను కబ్జా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిం చారు. పార్కులకు ప్రాణం పోస్తామని చెప్పా రు. సోమవారం జరిగిన హైడ్రా ప్రజావాణిలో భూకబ్జాలపై ఏకంగా 58 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను స్వీకరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికక్కడే పరిష్కారానికి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

దరఖాస్తుదారుల ముందే గూగుల్ మ్యాప్స్, లే ఔట్లు, ఎన్‌ఆర్‌ఎస్‌సీ, సర్వే ఆఫ్ ఇండియా, గ్రామ రికార్డులను ఆన్‌లైన్‌లో పరిశీలించి క్షేత్రస్థాయి విచారణకు అసెట్ ప్రొటెక్షన్ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, స మస్య పరిష్కారానికి గడువును కూడా బాధితుల సమక్షంలోనే నిర్ణయించడం విశేషం.

ఫిర్యాదుల్లో కొన్ని..

సికింద్రాబాద్ బోయిగూడ మున్సిపాలిటీ ఉన్న కాలంలో కురుమ సామాజిక వర్గం కో సం కేటాయించిన 2000 గజాల శ్మశానవాటికను కబ్జా చేసి, నిర్మాణాలు చేస్తున్నారని రాంగోపాల్‌పేట కార్పొరేటర్ చీర సుచిత్ర, కురుమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. బాచుపల్లి, శ్రీ సాయి కృష్ణ కాలనీలో 1700 గజాల పార్కు స్థలాన్ని రియల్టర్లు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.

గండిపేట, సర్వే నం. 69లో లేఔట్ ప్రకారం ఉన్న 25 అడుగుల రోడ్డును ఆక్రమించి, వందలాది కుటుంబాలకు దారి లేకుండా చేస్తున్నారని స్థానికులు వాపోయారు. కుత్బుల్లాపూర్, భగత్ సింగ్ నగర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి కోసం కేటాయించిన 3500 గజాల ప్రజా స్థలం కబ్జాల పాలవుతోందని స్థల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు.  ఈ ఫిర్యాదులన్నింటిపైనా తక్షణమే స్పందించి, విచారణ జరిపి, ప్రజా ఆస్తులను కాపాడుతామన్నారు.