calender_icon.png 5 August, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

05-08-2025 12:38:52 AM

ప్రమాద సంఘటనను పరిశీలించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

దౌల్తాబాద్, ఆగస్టు 4: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధంమైన సంఘటన  దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పబ్బ అశోక్ గుప్త తన ఇంటిలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. అయితే ఆదివారం అర్ధరాత్రి కూలర్ కు షార్ట్ సర్క్యూట్ రావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో పబ్బ అశోక్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ కంటనీరు పెట్టుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వలన తమకు భారీ నష్టం జరిగిందని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు అగ్ని ప్రమాద సంఘటనను పరిశీలించారు. అగ్ని ప్రమాద సంఘటన మూలంగా తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు.

అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి మనోధైర్యం అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, నాయకులు నర్సింహారెడ్డి, యాదగిరి, జనార్దన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, నాగరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.