calender_icon.png 13 May, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జునసాగర్‌లో అందగత్తెల సందడి

13-05-2025 12:00:00 AM

  1. బుద్ధవనాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు 
  2. జానపద, గిరిజన నృత్యాలతో ఘన స్వాగతం 
  3. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

నాగార్జునసాగర్, మే 12: హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ అందాల పోటీకి వివిధ దేశాల నుంచి వచ్చిన భామలు సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సందడి చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. వారు తెలంగాణలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాల సందర్శనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

అందులో భాగంగా అందాల పోటీల్లో పాల్గొంటున్న ఆసియా ఓసియాన్ గ్రూప్ 22 దేశాల సుందరీమ ణులు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సంద ర్శించారు. బుద్ధ వనంలో తెలంగాణ జానపద, గిరిజన నృత్య కళాకారులతో ఘన స్వాగతం పలికారు. బౌద్ధవనంలోని జాతక వనంలో బుద్ధ జీవన క్రమాన్ని తెలిపే శిల్పాలను వారు సందర్శించారు.

ఈ కేంద్రం ప్రత్యేకతలను మిస్ వరల్డ్ పోటీదారులకు శివనాగిరెడ్డి వివరించారు. బుద్ధ జయంతి రోజున ఈ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమనేది విశేషం. వీరు సాయం త్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు నాగారుజనసాగర్‌లో పర్యటించారు. బౌద్ధ థీమ్ పార్కు లోని బుద్ధుని విగ్రహాల చెంత జరిగిన ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అంతకుముందు పర్యాటక సంస్థ విజయ్‌విహార్‌లో విశ్రాంతి అనంతరం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. విందు అనంతరం హైదరాబాద్‌కు బయ లుదేరారు. కాగా విదేశాల్లోని బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ అధికారులు బుద్ధవనాన్ని ఎంపిక చేశారు. సుందరీమణుల సందర్శన సందర్భంగా నాగార్జునసాగర్ రహదారిపై పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.