calender_icon.png 13 May, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కాలేజీలకు ఇక రేటింగ్!

13-05-2025 01:01:46 AM

  1. థర్డ్ పార్టీ రేటింగ్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్న ఎన్‌ఎంసీ
  2. బోధన, అభ్యాసనా ప్రకియలపై ప్రత్యేక దృష్టి
  3. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రేటింగ్
  4. విద్యార్థులు మెరుగైన కాలేజీలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): దేశంలోని మెడికల్ కాలేజీల ర్యాంకింగ్స్ కోసం ఇప్పటివరకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ అంటూ లేదు. కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ర్యాం కింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) చేసే సర్వేనే ఇన్నాళ్లు దేశంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రామాణిక రేటింగ్, ర్యాంకింగ్‌గా ఉంటూ వస్తోంది.

అయితే ఇటీవల ఈ ర్యాంకింగ్ విధానంపైనా పలువురు పెదవివిరుస్తున్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాం కింగ్స్ అంత సమగ్రంగా ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పలు ప్రైవేట్ కాలేజీలు ఈ ర్యాంకింగ్ విధానంపై సర్వే చేసే ప్రొఫెసర్లను మేనేజ్ చేస్తూ స్థాయి లేకపోయినా అత్యుత్తమ ర్యాంకింగ్స్ ఉన్నట్లుగా చూయించుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో ఓ ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్ యూనివర్సిటీ ఇదే పంథా అనుసరిస్తూ ర్యాంకింగ్స్ నిర్ధారించేందుకు వచ్చే ప్రొఫెసర్లకు లంచాలు ఇస్తూ సీబీఐకి దొరికిపోయిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి  తెలిసిందే. 

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు తప్పనిసరి కాదు..

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తప్పనిసరి అయినా ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇందులో పాల్గొనాలనే నిబంధన లేదు. అందుకే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ ర్యాంకింగ్ సిస్టంకు దూరంగా కూడా ఉంటున్నాయి. రాష్ట్రం నుంచి ఈ ర్యాంకింగ్ వ్యవస్థలోకి కేవలం 3 ప్రైవేటు మెడికల్ కాలేజీలు మాత్రమే పాల్గొనగా అందులో ఒక్క కాలే జీ కూడా టాప్ 100ర్యాంకింగ్స్‌లో లేదు.

ఉస్మానియా మెడికల్ కాలేజీ మాత్రమే దేశంలో 48వ ర్యాంకులో నిలిచి సత్తాచాటింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ మెడికల్ కాలేజీలకు సరిపోయే విధంగా లేవని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) భావి స్తోంది. దీనికి తోడు కచ్చితంగా ప్రతీ మెడికల్ కాలేజీ కూడా తమ కాలేజీ ర్యాంకింగ్ విధానాన్ని అందరికీ తెలిపేందుకు ఈ సర్వేలో పాల్గొనాలనే నిబంధన ప్రవేశపెట్టడం ద్వారా మెరుగైన వైద్యవిద్యకు అవకా శం ఏర్పడుతుంది.

థర్డ్ పార్టీ సర్వే వల్ల డొల్ల కాలేజీలను గురించి విద్యార్థులు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. వైద్యవి ద్యను మరింత బలోపేతం చేసేందుకు, వైద్య విద్యార్థులు తమ ర్యాంకును బట్టి మరింత మెరుగైన కాలేజీని ఎంపిక చేసుకునేందుకుగాను అత్యుత్తమ ర్యాంకింగ్, రేటింగ్ ఇచ్చేందుకు గాను థర్డ్ పార్టీ విధానాన్ని అత్యంత కచ్చితత్వంతో అమలులోకి తీసుకొచ్చేందుకు ఎన్‌ఎంసీ నిర్ణయించింది.

ఇందుకుగాను 11 ప్రమాణాలు, 78 నిబంధనలతో ర్యాంకింగ్ సిస్టం అభివృద్ధి చేసేం దుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన గుర్తింపు, ర్యాంకింగ్, రేటింగ్స్ కోసం విధివిధానాలపై ప్రజాభిప్రాయాన్ని సైతం ఎన్‌ఎంసీ కోరుతోంది. 

సౌకర్యాలు, బోధనా పద్ధతులు ఉంటేనే..

ఎన్‌ఎంసీ, కర్రికులం అమలు, క్లినికల్ ఎక్స్‌పోజర్, క్లినికల్ ఫెసిలిటీస్, ఇంటర్న్‌షిప్, సౌకర్యాలు, మానవవనరులు, నీట్ యూజీ, పీజీ ఎంట్రన్స్‌లో విద్యార్థుల ర్యాంకింగ్స్, తదితర అంశాలను థర్డ్ పార్టీ బృందం సర్వే చేసి నిర్ధారించుకుంటుంది. సామర్థ్య ఆధారిత పాఠ్యాంశాల అమలును పరిశీలించి కళాశాలల్లో థియరీ, ప్రాక్టికల్ అనుభవాలను ఎలా సమన్వయం చేస్తున్నారో కూడా అంచనా వేస్తారు.

ప్రీ క్లినికల్, పారా క్లినికల్, క్లినికల్ సబ్జెక్టుల మధ్య సమన్వయం ఎలా ఉందో కూడా ఈ థర్డ్ పార్టీ సర్వేలో తేలుతుంది. కళాశాలల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ రివై జ్డ్ బేసిక్ వర్క్‌షాప్ (ఆర్‌బీసీడబ్ల్యూ)లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారో లేదో కూడా ఈ బృందం పరిశీలిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎన్ని ఒప్పందాలు చేసుకు న్నారనే అంశాలకు వెయిటేజీ ఉంటుంది.

ఓపీ హాజరు, మైనర్ సర్జరీలు, ల్యాబ్ టెస్టులు, రోజువారీ రోగుల రాక, ఎమర్జెన్సీ వైద్యసేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక పరికరాలు, తగినంత టీచింగ్ ఫ్యాకల్టీ, సిబ్బంది సేవలు ఉన్నాయో లేవో కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ ముసాయిదాపై సలహాలు, సూచనలు, అభిప్రాయా లను 21రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా పంపించాలని ఎన్‌ఎంసీ కోరుతోంది.

మెడికల్ అసె స్‌మెంట్ బోర్డు (ఎంఏఆర్‌బీ), క్వాలిటీ కౌన్సి ల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) మధ్య ఇప్పటికే థర్డ్ పార్టీ రేటింగ్స్ వ్యవస్థ కోసం ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 11 విభిన్న ప్ర మాణాలు, 92 నిబంధనలపై సర్వే నిర్వహించనున్నారు.

ఫలితంగా వైద్య విద్య ప్రమా ణాలు మరింతగా పెంచాలని ఎన్‌ఎంసీ కో రుకుంటోంది. సరైన రేటింగ్స్ ఉండే కాలేజీలను విద్యార్థులు ఎంచుకునేందుకు అవకా శం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.