calender_icon.png 14 July, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి

13-07-2025 05:04:45 PM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): బీసీ బిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna)పై అతనికి సంబంధించిన మెడిపల్లిలోని 'Q' న్యూస్ ఛానల్ ఆఫీస్ పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరుల మీద తక్షణమే పోలీస్ శాఖ వారు కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ లు డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

Q న్యూస్ ఆఫీస్ పై జాగృతి గుండాలు దాడి చేసి ఆఫీసులోని పర్మిషన్ ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందినీ భయభ్రాంతులకు గురిచేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బడుగుల గొంతుక వినిపించే న్యూస్ ఛానల్ పై దాడి చేయడం అంటే రెండు కోట్ల మంది బీసీల మీద దాడి చేయడమేనని అన్నారు. ఈ దుశ్చర్య మీద ప్రభుత్వం దృష్టి సారించి తక్షణమే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బొళ్ల నాగరాజు, జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, శేరి రవీందర్, నారగొని వెంకట్, రాజు తదితరులు పాల్గొన్నారు.