calender_icon.png 14 July, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలి

13-07-2025 05:01:18 PM

టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి..

మంచిర్యాల (విజయక్రాంతి): ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలని టీఎస్యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వైద్య శాంతికుమారి(TSUTF State Secretary Vaidya Shanti Kumari) కోరారు. ఆది వారం టీఎస్‌యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. 2023, జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పిఆర్సి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచినా నివేదిక వెలువరించకపోవడం అన్యాయమన్నారు. వెంటనే పిఆర్సి నివేదికను బహిర్గత పరిచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను మంజూరు చేయాలని, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ అయినా ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు జిపిఎఫ్ లోన్స్ పార్ట్ ఫైనల్, టిజిజిఎల్ఐ ఫైనల్ పేమెంట్స్, సరెండర్ లీవ్స్ తదితర పెండింగ్  బిల్లులన్నింటిని వెంటనే రిలీజ్ చేయాలన్నారు. 317 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధ్యాయులకు మెరుగైన హెల్త్ స్కీమ్ తీసుకురావాలని, కేజిబివి సిబ్బంది, ఆశ్రమ పాఠశాలల సిఆర్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, ప్రత్యేక వార్డెన్లను, కేర్ టేకెర్లను నియమించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పాఠశాలల పరిరక్షణ కోసం  ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్ట్ లను భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల సర్దుబాటును నిబంధనల ప్రకారం చేపట్టాలని నిర్వహించాలని, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు వేతనం చెల్లించాలని ప్రభుత్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండారపు చక్రపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజావేణు, జిల్లా ఉపాధ్యక్షులు వి. కిరణ్ కుమార్, జిల్లా కోశాధికారి బి కిరణ్ జిల్లా కార్యదర్శిలు కె చంద్రమౌళి, జి నర్సయ్య, జిల్లా కమిటీ సభ్యులు టీ రమేష్, తిరుపతి, అశోక్, రమేష్, జైపాల్, దేవయ్య, పోచన్న అన్ని మండలాల బాధ్యులు పాల్గొన్నారు.