calender_icon.png 14 July, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచి పరిశ్రమ కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోండి

14-07-2025 12:04:07 AM

జిల్లా కార్మిక శాఖ అధికారిని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, జులై 13 : నైపుణ్యం ఉన్న కార్మికులు విధులు నిర్వర్తించాల్సిన చోట దినసరి కూలీలతో విధులు నిర్వహించడం మూలంగానే సిగాచి పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుందని, యాజమాన్యం అత్యాశ, కక్కుర్తి మూలంగా 52 మంది కార్మికులు మృతి చెందగా మరో 30 మంది కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘోర దుర్ఘటనకు కారణమైన సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో పాటు దినసరి కార్మికులతో ప్రమాదకరమైన చోట విధులకు పంపిన సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో డీసీఎల్ రవీందర్ రెడ్డితో ఎమ్మెల్యే  సమావేశమ య్యారు.

ప్రధానంగా పటాన్ చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలలో గల పరిశ్రమలలో జరుగుతున్న కార్మికుల హక్కుల ఉల్లంఘన పై చర్చించారు. కూలీలకు విధులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధిక డబ్బులు ఇస్తామంటూ కాంట్రాక్టర్లు కార్మికులను ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారని తెలిపారు. కార్మికుల ప్రాథమిక హక్కులైన ఈఎస్‌ఐ, పీఎఫ్,సేఫ్టీ షూస్ లాంటివి సైతం కల్పించక పోవడంతో పాటు. వారికి సంబంధించిన ఎటువంటి రికార్డులు నమోదు చేయకుండా ప్రమాదకర విధుల్లోకి పంపిస్తున్నారని తెలిపారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తో పాటు కార్మిక శాఖ విభాగం అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం తగ్గుతాయని తెలిపారు.  

నూతన కల్వర్టుల ప్రారంభం..

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటి గ్రామ పరిధిలోగల మరనాత హీలింగ్ టెంపుల్ చర్చి సమీపంలో రూ.50లక్షలతో నిర్మించిన నూతన కల్వర్టులను ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిప్రారంభించారు. ప్రతి ఒక్కరి మతాన్ని గౌరవిస్తూ నియోజకవర్గంబలో పరమత సహనాన్ని పెంపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాంచంద్రారెడ్డి, చర్చి నిర్వహాకులు భాస్కరరావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.