13-07-2025 05:07:50 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఫోటో భవన్ రెండవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలోని ఫోటో భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఫోటో భవన్ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని అసోసియేషన్ అధ్యక్షులు పసుల వెంకటస్వామి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే జెండాను ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేకును కోసి, పంపిణీ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా ఉండి అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అనిదర్ రెడ్డి, సుజిత్ నక్క పవన్, తాళ్లపల్లి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరాజ్, ప్రచార కార్యదర్శులు పసుల రవి, రామసాని సురేందర్, కేశవేణి హరికృష్ణ, జూపాక సది, గౌరవ సలహాదారులు నక్క తిరుపతి, ఎంవి సత్యనారాయణ, జాడి ముకుందం,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి, ఇన్చార్జి నూనె సురేష్, లతో పాటు జిల్లా, రాష్ట్ర, మండల నాయకులు పాల్గొన్నారు.